Varasudu Collections vs Thegimpu Collections: మన దగ్గర ఎలా అయితే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయో తమిళంలో కూడా అజిత్ హీరోగా నటించిన తూనివు, విజయ్ హీరోగా నటించిన వారిసు అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తమిళ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వారిసు సినిమా కంటే తునివు సినిమా ముందంజలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అజిత్ తునివు సినిమా తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అవ్వగా విజయ్ వారిసు సినిమా తెలుగులో వారసుడు సినిమాగా రిలీజ్ అయింది.


ఇక తెగింపు ఎనిమిది రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటిరోజు రెండు కోట్ల 18 లక్షలు, రెండో రోజు 40 లక్షలు, మూడవరోజు 18 లక్షలు, నాలుగో రోజు 21 లక్షలు, 5వ రోజు 27 లక్షలు, ఆరవ రోజు 24 లక్షలు, ఏడవ రోజు 18 లక్షలు ఎనిమిదో రోజు దాదాపు 11 లక్షలు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా మూడు కోట్ల 66 లక్షల గ్రాస్ వసూలు చేయగా కోటి 87 లక్షల షేర్ వసూలు చేసినట్లయింది. ఇక తెగింపు సినిమా ఓవరాల్ బిజినెస్ మూడు కోట్ల 20 లక్షల రూపాయలకు జరగడంతో మూడు కోట్ల 50 లక్షలు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ణయించారు.


ఇంకా సినిమా దాదాపుగా కోటి 63 లక్షలు వసూలు చేస్తే తప్ప హిట్ అనిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాస్త లేటుగా వచ్చినా వారసుడు సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. మొదటి రోజు మూడు కోట్ల 10 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు రెండు కోట్ల 94 లక్షలు మూడో రోజు రెండు కోట్ల 69 లక్షలు నాలుగో రోజు రెండు కోట్ల 15 లక్షలు ఐదో రోజు కోటి 30 లక్షలు మొత్తంగా 12 కోట్ల 20 లక్షలు షేర్ 22 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 14 కోట్ల రూపాయలు చేయగా 15 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇంకా రెండు కోట్ల 80 లక్షలు వసూలు చేస్తే తప్ప ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం లేదు. అయితే కొంత ఆలస్యంగా అయినా ఈ మార్క్ ని వారసుడు సినిమా అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దిల్ రాజుని ఎంత వరకు గట్టెక్కిస్తుంది అనేది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. 
Also Read: VSR vs WV Collections: 'వీర సింహా'న్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తున్న వీరయ్య.. ఏకంగా అన్ని కోట్లు తేడానా?


Also Read: Veera Simha Reddy 7 Days Collections: బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో వీర సింహా రెడ్డి.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలంటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook