Varisu Collections vs Thunivu Collections: సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య తెలుగులో ఎలా పోటీ ఉందో తమిళంలో స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాల మధ్య కూడా అదే పోటీ ఉంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారిసు, అజిత్ కుమార్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తనకెక్కిన తునివు అనే సినిమాలు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుందని తమిళ ఆడియన్స్ చెబుతున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమాలు వెనుక పడ్డాయనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగా వారసుడు సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు తమిళనాడులో 20 కోట్ల 15 లక్షలు, కర్ణాటకలో ఐదు కోట్ల 62 లక్షలు, కేరళలో నాలుగు కోట్ల 55 లక్షలు, మిగతా భారతదేశం అంతా కోటి 15 లక్షలు ఓవర్సీస్ లో 14 కోట్ల 85 లక్షలు వసూలు చేసింది. తద్వారా మొదటి రోజు 46 కోట్ల 32 లక్షల గ్రాస్ వసూలు చేస్తే 23 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసినట్లు అయింది.


అదే సమయంలో అజిత్ హీరోగా నటించిన తునివు సినిమా తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో ఈ సినిమా 21 కోట్ల 20 లక్షలు వసూలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు కోట్ల 18 లక్షలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో నాలుగు కోట్ల 55 లక్షలు, కేరళలో కోటి 42 లక్షలు, మిగతా భారతదేశం అంతా కలిపి 55 లక్షల వసూలు చేసింది.


ఓవర్సీస్ లో 8 కోట్ల 85 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 38 కోట్ల 75 లక్షలు గ్రాస్ 19 కోట్ల 55 లక్షల షేర్ వసూలు చేసినట్లయింది. ఒక రకంగా చూసుకుంటే తెలుగు రిలీజ్ లేకపోయినా వారిసు సినిమాకే అజిత్ సినిమా కంటే కలెక్షన్లు ఎక్కువగా వచ్చినట్లయింది. మరి తెలుగులో వారిసు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి మరిన్ని కలెక్షన్స్ రావచ్చు ఏమో వేచి చూడాల్సి ఉంది.


Also Read: Balakrishna Target: ఏపీ ప్రభుత్వం మీద వీర సింహా రెడ్డి సెటైర్లు.. వెధవలు అంటూ ఘాటుగా!


Also Read: Balakrishna on Chandrababu:'బాబు బావ'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య.. 'రాయల్' అంటూ కామెంట్లు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook