Sunil Babu Death వారసుడు ఆర్ట్ డైరెక్టర్ మరణం.. తమన్, వంశీ పైడిపల్లి ఎమోషనల్ ట్వీట్లు
Art Director Sunil Babu Death వారసుడు సినిమా టీంలో విషాదం నెలకొంది. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు మరణించడంతో అంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. తమన్, వంశీ పైడిపల్లి, ఎస్వీసీ ప్రొడక్షన్ కంపెనీలు సునిల్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
Varisu Art Director Sunil Babu Death వారసుడు సినిమా టీంలో విషాదం నెలకొంది. వారసుడు సినిమా ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు నేటి ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. సునిల్ బాబు మరణం పట్ల సౌత్ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. కేరళ, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో సునిల్ బాబు తన మార్క్ వేశారు. రీసెంట్‌గా వచ్చిన సీతారామం సినిమా కూడా ఆయన పని చేశారు. అలాంటి సునిల్ బాబు మరణంతో మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
వారసుడు చిత్ర నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. మీరొక అద్భుతమైన వ్యక్తి.. మా టీంలో మీరు పని చేసినందుకు మాకు గర్వంగా ఉంది.. ఈ ప్రపంచంలోకి ఎంతో మంది తమ తమ ఉనికిని తమ తమ పనితనం ద్వారా చిరకాలం జీవిస్తూనే ఉంటారు.. మీలాంటి మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉంది.. మీరు ఇంకొన్ని ఏళ్లు జీవించి ఉండాల్సింది.. అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ వేసింది.
దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. మీరు మమ్మల్ని శూన్యంలోకి నెట్టేశారు సర్.. మీరు మాకు సహోదరుడి వంటి వారు.. సోల్ మేట్ వంటి వారు.. మీరు ఎంత నిశ్శబ్దంగా పని చేస్తుంటారో.. అంతే నిశ్శబ్దంగా కన్నుమూశారు.. మీరు పని చేసిన ప్రతీ సినిమాకు జీవం పోశారు.. మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం సర్.. అంటూ ఎమోషనల్ అయ్యాడు.
తమన్ స్పందిస్తూ..ఈ వార్త విని నా గుండె బద్దలైంది.. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు సర్.. మీరు చాలా చాలా మంచి వ్యక్తి.. మీరు వారిసు కోసం ప్రాణం పెట్టేశారు.. ఆ ఇంటి సెట్‌లను చూసినప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపించేది.. మన వారిసు టీం మిమ్మల్ని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటుంది.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు.
కేరళలో బెంగళూరు డేస్, ఇక్బాల్, నోట్ బుక్, గజిని వంటి సినిమాలకు సునిల్ బాబు పని చేశారు. ఆయన మరణం పట్ల దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు స్పందిస్తూ ఆత్మకు శాంతి కలగాని కోరుకున్నారు.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి