Varun Dhawan Supports to Samantha సమంత రాక రాక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత తన శాకుంతలం సినిమ కోసం బయటకు వచ్చింది. నిన్న శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో సమంత మెరిసింది. అతి కష్టం మీద సమంత బయటకు వచ్చినట్టు కనిపిస్తూంది. మెట్లు దిగే సమయంలోనూ తన అసిస్టెంట్ చేతిని పట్టుకుని దిగుతోంది సమంత. అలా అంత కష్టంగా ఉన్నా కూడా సమంత తన సినిమా కోసం బయటకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత బయటకు రావడానికి కూడగట్టుకున్న శక్తిని చూడని కొందరు ఆమె లుక్స్ బాగా లేదంటూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. సమంతలో ముందున్న గ్లో, చార్మింగ్ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత ఇన్ని రోజులుగా మెడిసిన్స్ తీసుకుంటూ బెడ్డుకే పరిమితమైంది. అయినా కూడా సమంత తన లుక్‌ను మెయింటైన్ చేసుకుంటూ ఉంది. కానీ ఇలాంటి కామెంట్లతో సమంత కాస్త డల్ అయ్యే అవకాశం ఉంది.


 



ఇలాంటి నెగెటివ్ కామెంట్లను సమంత కూడా తన స్టైల్లో తిప్పి కొట్టేసింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్‌ సమంతకు అండగా నిలబడ్డాడు. సమంత మీద జరుగుతున్న ట్రోలింగ్ మీద ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. మీరు అవతలి వారి బాధ గురించి ఎప్పుడూ ఆలోచించరు.. మీరు మీ క్లిక్ బైట్ హెడ్డింగ్‌ల గురించి ఆలోచిస్తుంటారు.. గ్లోనే కావాలంటే ఇన్ స్టాగ్రాం ఫిల్టర్స్‌లో ఉంటుంది.. ఒక్కసారి మీరు సమంతను కలవండి.. ఆమెలో ఎంత గ్లో ఉంటుందో మీకు తెలుస్తుంది అని వరుణ్‌ ధావన్ ట్వీట్ వేశాడు.


అలా వరుణ్‌ ధావన్ వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సమంత కోసం ఏ తెలుగు స్టార్ హీరో కూడా నిలబడలేదు. కానీ బాలీవుడ్ నుంచి వరుణ్‌ ధావన్ వచ్చాడు.. సమంత కోసం సపోర్ట్‌గా నిలబడ్డాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి