Varun Tej and Lavanya Thripati’s Love Affair: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులతో సహా అభిమానులు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలు, హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాల గురించి అయితే ప్రచారాలకు ఏ మాత్రం కొదవలేదు. ఇప్పుడు తాజాగా అలాంటి ప్రచారమే మరోసారి తెర మీదకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేమిటంటే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమవ్యవహారం. నిజానికి వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచినా ఆ సినిమా షూటింగ్లో వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారిందని, వీరిద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉందని గత రెండేళ్లుగా అడపా ప్రచారం జరుగుతూనే ఉంది.


Also Read: Kavya Thapar Photos: అసలు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా కావ్య థాపర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు!


ఈ విషయం మీద వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాలలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈ మధ్యలో వారి వివాహం కూడా త్వరలోనే జరగబోతోంది అంటూ మరో సారి ప్రచారం మొదలైంది. ముందుగా వీరి ఎంగేజ్మెంట్ జూన్ మూడో తేదీన జరుగుతుందని తర్వాత ఎప్పుడు వివాహం జరగబోతుంది అనే విషయం మీద కూడా క్లారిటీ వస్తుందని ప్రచారం మొదలైంది. నిజానికి ఈ విషయం గురించి స్పందించడం కోసం అటు వరుణ్ తేజ్ కుటుంబం గానీ లావణ్య త్రిపాఠి గానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు.


ఇక పలు సందర్భాలలో ఈ ప్రస్తావన వస్తే దాన్ని దాటవేస్తూ వచ్చారు తప్ప ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కూడా గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి కానీ లావణ్య త్రిపాఠి తరపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ అయితే ఈ విషయం మీద రాలేదనే చెప్పాలి. మరి నిజంగా వీరి వివాహం జరుగుతుందా లేక ఇది వట్టి ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి మరి.


Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి