Varun Tej - Lavanya Tripathi Pre Wedding Party: త్వరలో మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. పెళ్లికి సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‍లో ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఈ జంట. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరిగాయి. తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో మరోసారి ప్రీ-వెడ్డింగ్ పార్టీ జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు వారి ఇంట్లో జరిగిన వరుణ్ తేజ్ - లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీకి చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, ఉపాసన, వైష్ణవ్ తేజ్‍తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‍ చరణ్ హాజరు కాలేదు. ఈ పార్టీకి  హీరో నితిన్, హీరోయిన్ రితూ వర్మ కూడా వచ్చారు. 


తాజాగా ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అల్లు శిరీష్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వరుణ్-లావణ్యలు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం. నవంబర్‌లో వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తోంది. మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరూ లవ్ లో పడ్డారు. 



Also Read: Mahesh Babu Remuneration: రాజమౌళి సినిమా కోసం మహేష్ కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..