Varun Tej Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్ గా అతను నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పేలవమైన పర్ఫామెన్స్ కనబరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అతని కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.. కమర్షియల్ గా ఈ మూవీ హిట్ కాకపోయినా ఇందులో వరుణ్ తేజ్ యాక్షన్ మాత్రం అద్భుతంగా ఉంది అనడంలో డౌట్ లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెక్స్ట్ వరుణ్ ‘మట్కా’ అనే మూవీ లో చేస్తున్నాడు. మంచి పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ మూవీ ను అప్పటి పరిస్థితులను అనుసరిస్తూ గ్యాంబ్లింగ్ తరహా కథాంశం తో తెరకెక్కిస్తారు అని టాక్. ఈ చిత్రం నుంచి ఇది వరకే విడుదలైన గ్లింప్స్ మూవీ పై అంచనాలను బాగా పెంచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం మూడు కాలాలలో జరుగుతుంది. 


అంటే ఇందులో మనం వరుణ్ తేజ్ ను 20 ఏళ్లకు కుర్రాడి గా మధ్య వయస్సు ఉన్న వ్యక్తి గా.. ఆ తర్వాత 50 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి గా .. ఇలా మొత్తం మూడు దశల్లో చూడబోతున్నాం. భారీ పర్సనాలిటీ ఉన్న వరుణ్ తేజ్ ఈ చిత్రంలో 50 ఏళ్ల వృద్ధుడిగా కనిపించడం కోసం ఏకంగా కాస్త పొట్ట పెంచడానికి రెడీ అయిపోయాడట. హీరో, హీరోయిన్లు డైట్ విషయంలో ఫిజిక్ మెయింటెనెన్స్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో సైజ్ జీరో మూవీ కోసం బాగా ఎక్స్ట్రా సైజుకి పెరిగిన మన స్వీటీ తగ్గడానికి ఎన్ని తిప్పలు పడిందో మనకు అందరికీ తెలుసు.


ఈ నేపథ్యంలో వరుణ్ ఇలా కొద్దిగా లావు అయ్యి పొట్ట పెంచాలి అనుకునే డెసిషన్ పై మిక్స్డ్ స్పందన కనిపిస్తోంది. ఇంతకుముందు గద్దల కొండ గణేష్ చిత్రం కోసం కూడా వరుణ్ బాగా బాడీ పెంచాడు. పెద్ద గడ్డంతో, భారీ ఫిజిక్ తో ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయాడు. ఇప్పుడు తిరిగి మట్కా సినిమా కోసం అతను మరొకసారి పొట్ట పెంచడానికి రెడీ అవుతున్నాడు. ఇది అతని కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం. ఇంత కష్టపడినందుకైనా ఈ చిత్రం వరుణ్ కి మంచి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. అయితే ఇక ఈసారి కూడా డిజాస్టర్ ఎదురుకుంటే ఇక వరుణ్ తేజ్ పరిస్థితి అంతే అది కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.


Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?


 



 


 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter