Operation Valentine: వరుణ్ తేజ్ `ఆపరేషన్ వాలెంటైన్` కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
Operation Valentine Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నయా మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ డిసెంబరు 08న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది మేకర్స్.
Operation Valentine new Release date Announced: మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు - హిందీలో ద్విభాషా చిత్రంగా రాబోతుంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ (డిసెంబరు 08) కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. గ్లింప్స్ వీడియో ద్వారా విడుదల తేదీని రివీల్ చేసింది చిత్రయూనిట్. ఆపరేషన్ వాలెంటైన్ ను 2024 ఫిబ్రవరి 16వ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలెట్‍గా నటిస్తున్నారు. వరుణ్ సరసన బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ నటిస్తోంది. గ్లింప్స్ లో చూపించిన యుద్ధ విమానాల విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం వరుణ్ తేజ్ కు ఒక సాలిడ్ హిట్ కావాలి. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియెన్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇటీవల వరుణ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరు పెళ్లి ఇటలీలో జరిగింది.
Also Read: ITA Awards 2023: ఐటీఏ అావార్డ్స్ వేడుకలో బ్లాక్ అవుట్ ఫిట్స్‌తో దుమ్మురేపిన తారలు
Also Read: Guntur Kaaram Second Single: గుంటూరు కారం ‘ఓ మై బేబీ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook