COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని వివాహం చేసుకోబోతున్నారని రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయం మీద అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఇటు లావణ్య త్రిపాఠి వర్గం నుంచి గాని ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు.. అయితే ఈరోజు అంటే జూన్ 9వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్టుగా నిన్న తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఒక టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.


అయితే ఈ విషయం మీద కూడా మెగా ఫ్యామిలీ నుంచి కానీ లావణ్య త్రిపాఠి టీం నుంచి గాని ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఈరోజు ఒక ప్రైవేట్ ఈవెంట్లా జరగబోతోంది. చాలా తక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలోపు వివాహం చేసుకోవడానికి ముహూర్తం కూడా ఈరోజే నిశ్చయం చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాదులోని వరుణ్ తేజ్ నివాసంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది.


Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి


ఇక ఫోటోలను కూడా ఎక్కువగా బయటకు రిలీజ్ చేయకుండా కేవలం సెలెక్టెడ్ గా రెండు మూడు ఫోటోలు బయటకు రిలీజ్ చేయాలను కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి వివాహం కూడా గ్రాండ్ లెవెల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. గతంలో వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదల జొన్నలగడ్డ చైతన్య వివాహం రాజస్థాన్లోని ఒక రాయల్ వెడ్డింగ్ వెన్యూలో గ్రాండ్గా జరిగింది. అదేవిధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కూడా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్లా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి అధికారికంగా ఈరోజు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ తమ సోషల్ మీడియా వేదికలుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. చూడాలి ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది.


Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook