Matka King:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా ఫ్యామిలీ లో హీరోలు చాలామంది ఉన్నప్పటికీ సక్సెస్ ఫుల్ గా వరుస హిట్స్ అందుకుంటున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ. వీరిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. రీసెంట్ గా తను ఆరేళ్లుగా లవ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న వరుణ్ లవ్ లో అయితే సక్సెస్ సాధించాడు కానీ కెరీర్ లో సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. అతను నటించిన  చిత్రాలు వరుస డిజాస్టర్స్ గా మిగిలాయి. ప్రస్తుతం అతను కరుణ్ కుమార్ డైరెక్షన్ లో మట్కా అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.


అరవై..ఏనాబై..దశకం మధ్యలో భారతదేశంలో మట్కా అనే ఓ జూదక్రీడ ఎన్నో జీవితాలను తలకిందులు చేసింది. ఆ మట్కా కారణంగా  రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అన్న టాక్ బలంగా ఉంది. ప్రత్యేకించి స్టోరీ లైన్ గురించి మేకర్స్ చెప్పకపోయినా కంటెంట్ ఇదే అని ఫిలింనగర్ నుంచి కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇందులో అతను మూడు నాలుగు గెటప్స్ లో కనిపించాలట. ప్రతి గెటప్ డిఫరెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో బరువు పెరగడం..తగ్గడం లాంటివి చేస్తున్నాడు.


అయితే మరో పక్క అమెజాన్ ప్రైమ్ లో ఘనంగా మట్కా కింగ్ వెబ్ సిరీస్ ని లాంచ్ చేస్తున్నట్లు  ప్రకటించారు. ప్రత్యేకంగా స్టోరీ ఎవరిది అని చెప్పలేదు కానీ.. ఈ వెబ్ సిరీస్ కూడా రతన్ ఖాత్రిదే డే అని ముంబై మీడియా భావిస్తుంది. ఇక ఈ సిరీస్ లో ప్రస్తుతం ఓటీటీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి నాగరాజు ముంజులే దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి మిగిలిన క్యాస్టింగ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.


ఒకవేళ వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా స్టోరీ.. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ప్రకటించిన స్టోరీ రెండు రతన్ కు సంబంధించిన కథలే అయితే ఇక పోలికల పరంగా ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. ఇటు హీరో ,అటు డైరెక్టర్ ఇద్దరు కూడా వరుస డిజాస్టర్ నుంచి తమ ఇమేజ్ బయటకు లాగడం కోసం ఎంతో కష్టపడి మట్కా మూవీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం మట్కా  మూవీ ముందుగా విడుదలవుతుందా లేక బాలీవుడ్ వెబ్ సిరీస్ ముందుగా మార్కెట్లోకి వస్తుందా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. వెబ్ సిరీస్ ముందుగా వస్తే మాత్రం అది మక్కాకి పెద్ద జట్కా అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.


Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌


Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?



 


 


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook