Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

Janasena Kakinada MP Candidate Tangella Uday Srinivas: అతడు అభిమాని.. ఆ అభిమానంతోనే పార్టీకి 'భారీగా' అండదండలు ఇచ్చాడు. ఇప్పుడు అతడికి ఆ హీరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆ వ్యక్తికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 'రిటర్న్‌ గిఫ్ట్‌' ఇచ్చుకున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2024, 10:07 PM IST
Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

Tangella Uday Srinivas: అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కాకినాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించాడు. గాజు గ్లాస్‌ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. పోటీ చేసే అభ్యర్థి ఎవరో కాదు యువ పారిశ్రామికవేత్త, ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తే తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌.

Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌

 

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పవన్‌ కల్యాణ్‌ సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. రెండు ఎంపీ స్థానాల్లో ఒకటైన కాకినాడకు పార్టీ అభ్యర్థిగా ఉదయ్‌ శ్రీనివాస్‌ను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన అధిపతి పవన్‌ మాట్లాడుతూ.. 'ఉదయ్‌ నా కోసం ఎంతో త్యాగం చేశాడు. అతడిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ క్రమంలోనే పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెబితే అప్పుడు ఆలోచిస్తా. పిఠాపురం నుంచి ఉదయ్‌ పోటీ చేస్తాడు. అప్పుడు నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా' అని వెల్లడించారు.

Also Read: Fishing Ban: 'ఉప్పెన' సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ "పని" నిషేధం

 

ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎవరు?
ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎవరో కాదు యువ పారిశ్రామికవేత్త. 'టీ టైమ్‌' అనే చాయ్‌ కంపెనీ అధినేత. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోనే 'టీ టైమ్‌' ప్రఖ్యాత ఫ్రాంచైజీ కంపెనీగా రాణిస్తోంది. రూ.5 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు రూ.35 కోట్లకు పైగా విలువ కలిగిన కంపెనీగా తీర్చిదిద్దాడు. అతడి టీ టైమ్‌ కంపెనీకి చెందిన 3 వేలకు పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తగా విజయం సాధించిన ఉదయ్‌ శ్రీనివాస్‌కు మొదటి నుంచి పవన్‌ కల్యాణ్‌ చాలా ఇష్టం. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పవన్‌కు ఉదయ్‌ మద్దతుగా నిలుస్తున్నాడు. కొన్ని నెలల కిందట పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన 'వారాహి యాత్ర'కు వాహనాలను సమకూర్చింది ఉదయ్‌ శ్రీనివాసే. పవన్‌కు ఇచ్చిన 'వారాహి' వాహనం ఇప్పటికే ఉదయ్‌ శ్రీనివాస్‌ పేరుపైనే రిజిస్టర్‌ నమోదై ఉంది. జనసేనకు భారీగా ఆర్థికంగా అండదండలు అందించాడు. ఈ క్రమంలోనే గతేడాది జనసేనలో ఉదయ్‌ శ్రీనివాస్‌ చేరాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News