Operation Valentine trailer: ప్రస్తుతం తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత గాథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో అప్పట్లో 2008లో జరిగిన 26/11 దాడుల నేపథ్యంలో 'మేజర్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ కోవలో 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో మన దేశ సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కర మూకలను మన దేశ సైన్యం .. బాలాకోట్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తెరకెక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో వరుణ్ తేజ్.. ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 'ఫైటర్' మూవీ కూడా ఇదే కాన్సెప్ట్‌తో బాలాకోట్‌లో మన దేశ సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఇపుడు అదే కాన్సెప్ట్‌తో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని తెరకెక్కించారు. 2024లో ప్రేమికుల దినోత్సవం రోజున దేశ సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరుల అంతం చేయడానికి మన దేశం చేసిన సర్జికల్ స్ట్రైక్‌కు 'ఆపరేషన్ వాలెంటైన్' పేరు పెట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ఇందులో ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటుల తమ పరిధి మేరకు నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేస్తే.. హిందీ ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేసారు.




ఈ ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా విజువల్స్ ఉన్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. మొత్తంగా తెలుగులో ఈ తరహా చిత్రం రావడం గమనార్హం. వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ముందు నుంచి హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.మరి 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో వరుణ్ తేజ్ మరో హిట్ అందుకుంటాడా ? లేదా అనేది చూడాలి.


Read More: White Hair Problem Solution: కొబ్బరి నూనెలో ఈ పొడులు కలిపి తెల్ల జుట్టుకు అప్లై చేస్తే..నల్ల జుట్టు మళ్లీ తెల్లగా మారదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook