White Hair Problem Solution: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల యువతలో కూడా సులభంగా తెల్ల జుట్టు వస్తోంది. అయితే ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మందిలో ఆధునిక జీవనశైలి కారణంగా కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఖరీదైన ప్రోడక్ట్స్ కూడా అతిగా వాడుతున్నారు. వీటిని వినియోగించినప్పుటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్‌ని ప్రతి రోజు వినియోగిస్తే సులభంగా రూపాయి ఖర్చు లేకుండా ఉపశమనం పొందవచ్చు.
తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్య పెరగడమే కాకుండా ఇతర జుట్టు సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. జుట్టును నల్లగా తయారు చేయడానికి మెలనిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మెలనిన్ స్థాయిలను పెంచే నూనెలను వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఆయుర్వేద నిపుణులు సూచించిన నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీని కోసం ముందుగా సౌవ్‌పై ఒక చిన్న బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోసుకోవాల్సి ఉంటుంది. అందులోనే కరివేపాకు మరియు కలబంద ముక్కలు వేసుకుని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే చెంచా అవిసె గింజలు, జీలకర్ర గింజలను వేసి పోసుకున్న నీరు సగం అయ్యేంత వరకు మరగబెట్టుకోవాల్సి ఉంటుంది. నీరు సగం అయ్యాకా అందులోనే ఆవాలతో తయారు చేసిన నూనెను వేసుకుని మరింత మరిగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం మరిగిన తర్వాత ఒక ఫ్లాస్టిక్ బాటిల్ నింపాల్సి ఉంటుంది. ఇలా నింపుకున్న నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు వినియోస్తే తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
కరివేపాకుతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి 2 చెంచాల ఉసిరి పొడి, రెండు చెంచాల కరివేపాకు పొడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా సౌవ్‌పై బౌల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులోనే కొబ్బరి నూనెను వేసుకుని పై పొడులను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మరగబెట్టిన నూనెను గాజు సీసాలతో ఫిల్టర్ చేసుకుని జుట్టుకు వినియోగిస్తే తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. పై సమాచారానికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter