Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: సంక్రాంతి అనేది తెలుగు వారికి ఎంత పెద్ద పండుగో సినిమా వాళ్లకు కూడా అంతే పెద్ద పండుగ. ప్రతి సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా అవి సూపర్ హిట్లుగా నిలుస్తాయని భావిస్తూ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. అలాగే 2023 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక లాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ సినిమాని తెరకెక్కించింది ఆయన అభిమాని గోపీచంద్ మలినేని అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాని తెరకెక్కించింది ఆయన అభిమాని బాబీ. ఇలా రెండు సినిమాల మధ్య అనేక సారూప్యతలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల మీద ముందు నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల మధ్య ప్రతి చిన్న విషయానికి పోటీ పెట్టి మరి అందరూ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో వీర సింహారెడ్డి సినిమా విడుదలై 14 రోజుల పూర్తికాగా వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై 13 రోజులు పూర్తయింది.


ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది పరిశీలిద్దాం. ఇప్పటివరకు వీర సింహారెడ్డి సినిమా 14 రోజులకు గాను నైజాం ప్రాంతంలో 16 కోట్ల 73 లక్షలు సీడెడ్ ప్రాంతంలో 16 కోట్ల 18 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎనిమిది కోట్ల 46 లక్షలు, ఈస్ట్ గోదావరి ఐదు కోట్ల 52 లక్షలు, వెస్ట్ గోదావరి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు, గుంటూరు వారి కోట్ల 30 లక్షలు, కృష్ణాజిల్లా నాలుగు కోట్ల 64 లక్షలు, నెల్లూరు జిల్లాలో రెండు కోట్ల 93 లక్షలు వెరసి ఇప్పటివరకు 14 రోజులకు 64 కోట్ల 90 లక్షల షేర్ 105 కోట్ల రెండు లక్షల గ్రాస్ వసూలు చేయగా 14 రోజులకు గాను కర్ణాటక సహా  భారతదేశంలో నాలుగు కోట్ల 77 లక్షలు, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 73 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల 40 లక్షల షేర్ 126 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


అదే వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 13 రోజులకు గాను నైజాం ప్రాంతంలో 32 కోట్ల 82 లక్షలు సీడెడ్ ప్రాంతంలో 16 కోట్ల 59 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 15 కోట్ల 26 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 10 కోట్ల 31 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల 69 లక్షలు, గుంటూరు జిల్లాలో ఏడు కోట్ల 30 లక్షలు, కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల 9 లక్షలు, నెల్లూరు జిల్లాలో మూడు కోట్ల 76 లక్షలు వెరైటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద 98 కోట్ల 82 లక్షల షేర్ 160 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక 13 రోజులకు కర్ణాటక సహా మిగతా భారతదేశంలో ఏడు కోట్ల 64 లక్షలు ఓవర్సీస్ లో 12 కోట్ల 66 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 119 కోట్ల 12 లక్షల షేర్ 24 కోట్ల 12 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఒక రకంగా చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా వీర సింహారెడ్డి సినిమా కంటే 44 కోట్ల ముందంజలో ఉంది. ఒకరోజు వెనకే వచ్చినా 44 కోట్లు ఎక్కువ వసూలు చేసి ఈ సినిమా మరింత ముందుకు వెళ్ళింది.


Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?  


Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook