VSR vs WV Collections: `వీర సింహా`న్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తున్న వీరయ్య.. ఏకంగా అన్ని కోట్లు తేడానా?
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ రెండు సినిమాల వసూళ్ల మీద ఒక లక్కు వేద్దాం పదండి..
Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: సంక్రాంతి సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఆరో రోజున ఎంత వసూలు చేశాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. వాల్తేరు వీరయ్య సినిమా కంటే నందమూరి బాలకృష్ణ సినిమా ఒకరోజు ముందు అంటే జనవరి 12న విడుదలైంది. అయితే ముందుగా విడుదలైన వీర సింహారెడ్డి సినిమా మొదటిరోజు పాతిక కోట్ల 35 లక్షలు వసూలు చేస్తే వాల్తేరు వీరయ్య ఒకరోజు తర్వాత విడుదలై 22 కోట్ల 90 లక్షలు వసూలు చేసింది.
రెండో రోజు వీర సింహారెడ్డి ఐదు కోట్ల 25 లక్షలు వాల్తేరు వీరయ్య 11 కోట్ల 95 లక్షలు, మూడోరోజు వీర సింహారెడ్డి 6 కోట్ల 45 లక్షలు వాల్తేరు వీరయ్య మాత్రం 12 కోట్ల 61 లక్షలు వసూలు చేసింది. వీర సింహారెడ్డి నాలుగో రోజు ఏడు కోట్ల 25 లక్షలు, ఆరు కోట్ల 25 లక్షలు, నాలుగు కోట్ల 80 లక్షలు వసూలు చేయగా వాల్తేరు వీరయ్య నాలుగో రోజు 11 కోట్ల 42 లక్షలు, 8 కోట్ల 80 లక్షలు, 7 కోట్ల 33 లక్షలు వసూలు చేసింది. ఇక మొదటిరోజు వీర సింహారెడ్డి డామినేషన్ కనిపించగా తర్వాత ఐదురు రోజుల పాటు వాల్తేరు వీరయ్య డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఆరు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో కలిపి 55 కోట్ల 35 లక్షల షేర్, 89 కోట్ల 65 లక్షల గ్రాస్ వీర సింహారెడ్డి సినిమా వసూలు చేస్తే వాల్తేరు వీరయ్య మాత్రం 75 కోట్ల 01 లక్షల షేర్, 121 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు అయింది. మొదటి ఆరోజు రోజులకు వీర సింహారెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల 10 లక్షలు షేర్ వసూలు చేస్తే 109 లక్షల 40 లక్షల గ్రాస్ వసూలు చేయగా వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే 91 కోట్ల 41 లక్షల షేర్ 157 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
బాలకృష్ణ సినిమా ఒకరోజు ముందే విడుదల కావడంతో ఆ సినిమా ఏడో రోజు వసూళ్లు 68.51 షేర్ 114.95 కోట్ల గ్రాస్ గా ఉన్నాయి. అంటే ఒకరకంగా బాలకృష్ణ సినిమా ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం కంటే ఎక్కువ చిరంజీవి సినిమా ఆరు రోజుల్లో ఎక్కువ సంపాదించినట్టు అయింది. దీంతో ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
Also Read: Waltair Veerayya Day 6: ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన వీరయ్య.. ఎన్ని కోట్ల లాభమంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook