Veera Simha Reddy 8 Days Collections: జోరు తగ్గిన `వీర సింహం` బ్రేక్ ఈవెన్ కు ఇంకా దూరంగానే?
Veera Simha Reddy Day 8 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి విడుదలై ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయిన క్రమంలో ఎనిమిది రోజుల కలెక్షన్స్ మీద ఒక లుక్కేద్దాం.
Veera Simha Reddy 8 Days Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి విడుదలై ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఎనిమిది రోజుల థియేట్రికల్ చేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒక లుక్కేద్దాం. వీర సింహారెడ్డి సినిమా మొదటిరోజు పాతిక కోట్ల 35 లక్షలు వసూలు చేయగా రెండో రోజు ఐదు కోట్ల 25 లక్షలు, మూడో రోజు ఆరు కోట్ల 45 లక్షలు, నాలుగో రోజు ఏడు కోట్ల 25 లక్షలు, ఐదవ రోజు 6 కోట్ల 25 లక్షలు, ఆరవ రోజు నాలుగు కోట్ల 80 లక్షలు, ఏడవ రోజు మూడు కోట్ల 16 లక్షలు, 8వ రోజు కోటి 53 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల నాలుగు లక్షల షేర్ 97 కోట్ల 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇక ఎనిమిదవ రోజు ఏరియా వారీగా చూస్తే నైజాం 41 లక్షలు, సీడెడ్ 21 లక్షలు, ఉత్తరాంధ్ర 37 లక్షలు, ఈస్ట్ గోదావరి 20 లక్షలు, వెస్ట్ గోదావరి 11 లక్షలు, గుంటూర్ ఏడు లక్షలు, కృష్ణ 9 లక్షలు, నెల్లూరు ఏడు లక్షలు కలిపి మొత్తం కోటి 53 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక వీర సింహారెడ్డి సినిమా కర్ణాటక సహా మిగతా భారతదేశంలో ఎనిమిది రోజులకు గాను నాలుగు కోట్ల 55 లక్షలు వసూలు చేయగా ఓవర్సీస్ లో ఐదు కోట్ల యాభై ఐదు లక్షలు వసూలు చేసి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల 14 లక్షలు షేర్, 117 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ 73 కోట్లు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా ఇంకా మూడు కోట్ల 86 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలుస్తుంది.
అయితే దాదాపు అది కష్టమైన విషయమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా ఆయన సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో నటించింది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నా అనేక కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడి చివరికి జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో మంచి జోరు చూపించిన ఈ సినిమా తర్వాత ఎందుకో వెనక పడుతూ వచ్చింది.
నోట్: ఈ సమాచారం వివిధ బాధ్యత మాల ద్వారా మేము సేకరించినదే కానీ దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు
Also Read: VSR vs WV Collections: 'వీర సింహా'న్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తున్న వీరయ్య.. ఏకంగా అన్ని కోట్లు తేడానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook