Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: టాలీవుడ్ లో ఇద్దరు బడా స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈసారి సంక్రాంతి రేసులో పోటీ పడిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన జనవరి 13వ తేదీన విడుదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ రెండు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థ నుంచి రావడంతో పాటు ఒకే హీరోయిన్ నటించడంతో ఈ రెండు సినిమాల మధ్య ప్రతి విషయంలోనూ పోలిక పెడుతున్నారు అభిమానులు. అయితే ఈ రెండు సినిమాలు ఇప్పటికీ ఎనిమిది రోజుల థియేట్రికల్ రన్ చేసుకున్నాయి. బాలకృష్ణ సినిమా తొమ్మిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా ఈ రెండు సినిమాల మధ్య వసూళ్ల తేడా ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 


వీర సింహా రెడ్డి కలెక్షన్స్
ముందుగా వీర సింహా రెడ్డి వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు పాతిక కోట్ల 35 లక్షలు, రెండవ రోజు 5 కోట్ల 25 లక్షలు, మూడవరోజు ఆరు కోట్ల 45 లక్షలు, నాలుగవ రోజు ఏడు కోట్ల 25 లక్షలు, 5వ రోజు 6 కోట్ల 25 లక్షలు, ఆరవ రోజు నాలుగు కోట్ల 80 లక్షలు, ఏడవ రోజు మూడు కోట్ల పదహారు లక్షలు, ఎనిమిదవ రోజు కోటి 53 లక్షలు వసూలు చేసింది. ఇక తొమ్మిదవ రోజు 94 లక్షల షేర్ ఒక కోటి 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల 98 లక్షల షేర్ 98 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేయగా తొమ్మిది రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి నాలుగు కోట్ల 58 లక్షలు ఓవర్సీస్ లో ఐదు కోట్ల 58 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది రోజులకు గాను 71 కోట్ల 14 లక్షల షేర్ వసూలు చేస్తే 119 కోట్ల పాతిక లక్షల గ్రాస్ వసూలు చేసింది.


వాల్తేరు వీరయ్య కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 22 కోట్ల 90 లక్షలు, రెండో రోజు 11 కోట్ల 95 లక్షలు, మూడవరోజు 12 కోట్ల 61 లక్షలు, నాలుగో రోజు 11 కోట్ల 42 లక్షల, 5వ రోజు ఎనిమిది కోట్ల 80 లక్షలు, ఆరవ రోజు ఏడు కోట్ల 33 లక్షలు, ఏడవ రోజు నాలుగు కోట్ల 85 లక్షలు, ఎనిమిదవ రోజు  మూడు కోట్ల 85 లక్షల షేర్, 6 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఎనిమిది రోజులకు కర్ణాటక సహా మిగతా ప్రాంతాల్లో ఆరు కోట్ల 40 లక్షలు రాబడితే ఓవర్సీస్ లో 11 కోట్ల ఐదు లక్షల రాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిమిది రోజులకు 101 కోట్ల 16 లక్షల షేర్, 173 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు వెనకేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని 12 కోట్ల 16 లక్షల లాభాలతో మరింత ముందుకు దూసుకు వెళుతోంది.


Also Read: Waltair Veerayya Day 8 Collections: 100 కోట్లు కొట్టేసిన చిరు.. టాలీవుడ్ లో 14వ సినిమాగా ఎంట్రీ!


Also Read: Veera Simha Reddy 9 Days Collections: కలెక్షన్స్ లో దారుణంగా డ్రాప్..ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook