Waltair Veerayya Day 8 Collections: 100 కోట్లు కొట్టేసిన చిరు.. టాలీవుడ్ లో 14వ సినిమాగా ఎంట్రీ!

Waltair Veerayya Day 8 Collections: మెగాస్టార్ చిరంజీవి, రవితేజ మాస్ మసాలా కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య రెండో వారంలోకి ఎంట్రీ ఇవ్వగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎంత వచ్చాయి ? అనే వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 21, 2023, 11:39 AM IST
Waltair Veerayya Day 8 Collections: 100 కోట్లు కొట్టేసిన చిరు.. టాలీవుడ్ లో 14వ సినిమాగా ఎంట్రీ!

Waltair Veerayya 8 Days Total Collections: మెగాస్టార్ చిరంజీవి, రవితేజ మాస్ మసాలా కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం భారీ ఎత్తున వసూళ్లు కనబరిచిన ఈ సినిమా రెండో వారం మొదటి రోజు ఎలా వసూళ్లు రాబట్టింది అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 22 కోట్ల 90 లక్షలు, రెండో రోజు 11 కోట్ల 95 లక్షలు, మూడవరోజు 12 కోట్ల 61 లక్షలు, నాలుగో రోజు 11 కోట్ల 42 లక్షల, 5వ రోజు ఎనిమిది కోట్ల 80 లక్షలు, ఆరవ రోజు ఏడు కోట్ల 33 లక్షలు, ఏడవ రోజు నాలుగు కోట్ల 85 లక్షలు వసూలు చేసింది.

ఇక ఎనిమిదవ రోజు నైజాం ప్రాంతంలో కోటి 25 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 26 లక్షలు, ఉత్తరాంధ్ర 95 లక్షలు, ఈస్ట్ గోదావరి 50 లక్షలు, వెస్ట్ గోదావరి పాతిక లక్షలు, గుంటూరు 23 లక్షలు, కృష్ణ 24 లక్షలు, నెల్లూరు 17 లక్షలు వెరసి 8వ రోజు మూడు కోట్ల 85 లక్షల షేర్, 6 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఇదే సినిమా ఎనిమిది రోజులకు గాను కర్ణాటక సహా మిగతా ప్రాంతాలలో ఆరు కోట్ల 40 లక్షలు రాబడితే ఓవర్సీస్ లో 11 కోట్ల ఐదు లక్షల రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల 16 లక్షల షేర్ 173 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

అలా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో 100 కోట్ల సినిమాగా నిలిచిన 14వ సినిమాగా నిలిచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో 2 వంద కోట్ల సినిమాలు ఉండగా ఇది మూడవ సినిమాగా నిలిచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సైరా వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరగా ఇది ఆయన కెరీర్ లో మూడవ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 12 కోట్ల 16 లక్షల లాభాలతో మరింత ముందుకు దూసుకు వెళుతోంది. 
Also Read: Veera Simha Reddy 9 Days Collections: కలెక్షన్స్ లో దారుణంగా డ్రాప్..ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే?

Also Read: Gopichand - Prabhas: ప్రభాస్ కి కధ చెప్పిన గోపీచంద్.. 'మైత్రీ'తో సినిమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News