Veera Simha Reddy Day 3 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే రెండో రోజే వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కావడంతో పెద్ద ఎత్తున థియేటర్లు తొలగించాల్సిన పరిస్థితుల్లో సినిమా కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడవరోజు కలెక్షన్స్ లో సినిమా కొంత పుంజుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులు ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం మీద ఒక లుక్కేద్దాం. మొదటి రోజు ఈ సినిమా పాతిక కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేస్తే రెండవ రోజు ఐదు కోట్ల 25 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక మూడవరోజు ఆరు కోట్ల 45 లక్షల మేర షేర్ వసూళ్లు సాధించింది. ఇక వీర సింహారెడ్డి సినిమా మూడు రోజుల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా వచ్చాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నైజాం ప్రాంతంలో సినిమాకి రెండు కోట్ల 2 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.


సీడెడ్ ప్రాంతంలో కోటి రూపాయల అరవై ఎనిమిది లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 72 లక్షలు వసూలు చేసింది. ఇక వీరసింహారెడ్డి సినిమా ఈస్ట్ గోదావరి జిల్లాలో 60 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 24 లక్షలు, గుంటూరు జిల్లాలో 48 లక్షలు వసూలు చేసింది. ఇక అదే రోజు కృష్ణాజిల్లాలో 44 లక్షలు వసూలు చేస్తే నెల్లూరు జిల్లాలో 27 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మీద ఆరు కోట్ల 45 లక్షల షేర్ 10 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించినట్లయింది. మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37 కోట్ల ఐదు లక్షల షేర్ 59 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


అదే సమయంలో కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం మీద మూడు రోజులకు మూడు కోట్ల ఐదు లక్షలు ఓవర్సీస్ లో నాలుగు కోట్ల 40 లక్షల వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల 50 లక్షలు షేర్ 73 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అలా సినిమా ఓవరాల్గా 73 కోట్లు బిజినెస్ చేయడంతో 74 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఈ సినిమా సాధించిన కలెక్షన్ల మేరకు పరిశీలిస్తే ఇంకా 29 కోట్ల యాభై లక్షల షేర్ వసూళ్లు చేస్తే అప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లుగా నిర్ధారిస్తారు. అయితే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ మేర వసూళ్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో సినిమా ఏ మేరకు వసూళ్లు రాబడుతుంది అనేది.
Also Read: Roja Slams Balakrishna: ఏపీ ప్రభుత్వం మీద డైలాగులు..బాలయ్యపై రోజా ఫైర్.. చంపించాలని చూశారంటూ!


Also Read: Rajeev Kanakala Charecter Died: వీర సింహా రెడ్డి సహా “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు. ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook