Rajeev Kanakala Charecter Died: వీర సింహా రెడ్డి సహా “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు. ఇవే!

Rajeev Kanakala Charecter Died Movies: అనేక రకాల పాత్రలు చేస్తూ వచ్చిన రాజీవ్ కనకాల ఎక్కువగా ఏ సినిమాలో కనిపించినా ఆయన పాత్ర చనిపోతుంది అనే ప్రచారం ఉంది. అలా ఆయన చనిపోయిన సినిమాల మీద ఒక లుక్కేద్దాం  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 14, 2023, 11:17 PM IST
Rajeev Kanakala Charecter Died: వీర సింహా రెడ్డి సహా “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు. ఇవే!

14 Movies in Which Rajeev Kanakala Charecter Died: తెలుగు నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు, దర్శక- నిర్మాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక వందల మంది నటులను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన దేవదాస్ కనకాల కుమారుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాజీవ్ కనకాల ముందుగా దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది వంటి సీరియల్స్ లో హీరోగా నటించారు. ఆ తరువాత బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరీర్ మొదట్లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చేవారు. విలన్ గా, విలన్ కుమారుడిగా, హీరో స్నేహితుడుగా ఇలా అనేక రకాల పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ సినిమాలో కనిపించినా ఆయన పాత్ర చనిపోతుంది అనే ప్రచారం ఉంది.

ఇటీవల ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఆయన పాత్ర చనిపోతుంది. కేవలం రెండు సీన్లకు మాత్రమే రాజీవ్ కనకాల పరిమితం అయ్యారు. అయితే ఇలా రాజీవ్ కనకాల నటించిన సినిమాల్లో దాదాపు 14 సినిమాల్లో ఆయన మరణించాడట. తన సినీ కెరీర్ లో దాదాపు 150 సినిమాల్లో నటిస్తే అందులో 14 సినిమాల్లో ఆయన పాత్ర చనిపోవడం గమనార్హం. అయితే ఏ ఏ సినిమాల్లో ఆయన పాత్ర చనిపోతుంది అనే విషయం మీద ఒక లుక్కేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హరికృష్ణ ప్రధాన పాత్రలో నటించిన స్వామి అనే సినిమాలో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటిస్తాడు ఆ సినిమాలో ఆయన పాత్ర చనిపోతుంది. తర్వాత అశోక్ అనే సినిమాలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో కనిపిస్తారు, విలన్ల చేతిలో దారుణంగా హత్యకు గురవుతాడు.

తర్వాత రాజు గారి గది 2 సినిమాలో రాజీవ్ కనకాల హీరో అన్నయ్య పాత్రలో నటిస్తాడు ఈ సినిమాలో కూడా ఆయన కన్నుమూస్తాడు. తరువాత ఏ ఫిలిం బై అరవింద్ సినిమాలో రాజీవ్ కనకాల నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి చివరికి కన్నుమూస్తాడు. ఇక మహేష్ బాబు అతడు సినిమాలో రాజీవ్ కనకాల పార్ధు అనే పాత్రలో నటిస్తాడు, కేవలం ఒకే సీన్ కి పరిమితమైనా ఆ ఒక్క సీన్ లోనే ఆయన కన్నుమూస్తాడు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన హరే రామ్ సినిమాలో రాజీవ్ కనకాల ఒక డాక్టర్ పాత్రలో నటిస్తాడు, ఆ పాత్ర కూడా అనూహ్యంగా చనిపోతుంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతిథి సినిమాలో రాజీవ్ కనకాల గౌతమ్ అనే పాత్రలో నటించి సినిమాలో కన్నుమూస్తాడు.

దూకుడు సినిమాలో రాజీవ్ కనకాల మహేష్ బాబు బాబాయి పాత్రలో నటించి కన్నుమూసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. బాద్షా సినిమాలో రాజీవ్ కనకాల కూడా ఒక డాక్టర్ పాత్రలో నటించి అనూహ్యంగా కన్నుమూస్తాడు. రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో కూడా రాజీవ్ కనకాల పాత్ర కన్ను మూస్తుంది. అలాగే రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ అనే సినిమాలో రాజీవ్ కనకాల జగ్గు అనే ఒక దాదా పాత్రలో నటిస్తాడు. ఆ పాత్ర కూడా కన్ను మూస్తుంది. రంగస్థలం సినిమాలో రాజీవ్ కనకాల రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయ భర్త పాత్రలో నటిస్తాడు.

ఆ సినిమాలో కూడా అతని పాత్ర చనిపోతుంది. బింబిసార అనే సినిమాలో రాజీవ్ కనకాల రాజీవ్ అనే పాత్రలో కనిపించి చనిపోతాడు. ఇక వీర సింహారెడ్డి సినిమాలో కూడా రాజీవ్ కనకాల పోషించిన పాత్ర మంచిదే కానీ ఆ పాత్ర కూడా రెండు సీన్ల తర్వాత చనిపోవడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏ సినిమాలో అయితే రాజీవ్ కనకాల పాత్రలు చనిపోతాయో ఆ సినిమాలు కచ్చితంగా మంచి హిట్ అవుతాయట, నిజంగా ఒకరకంగా చూసుకుంటే ఇప్పటివరకు పైన చెప్పుకున్న సినిమాలన్నీ బాగా ఆడిన సినిమాలే ఒకటి రెండు సినిమాలు ఆడకపోయినా ఆయా హీరోలకు మాత్రం బెస్ట్ మూవీస్ గా మిగిలిపోయాయి.

Also Read: Balakrishna Opens up: వీర సింహా రెడ్డిలో అందుకే ఆ డైలాగులు.. అసలు విషయం బయటపెట్టిన బాలకృష్ణ!

Also Read: Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News