Veera Simha Reddy Collections: `వీర సింహా రెడ్డి`కి భారీ దెబ్బ్బేసిన వీరయ్య.. మరీ ఇంత దారుణంగా పడిపోయాయా?
Veera Simha Reddy Movie Day 2 Collections: వీర సింహారెడ్డి సినిమా మొదటిరోజు సంచలన వసూళ్లు సాధించిన క్రమంలో రెండో రోజు కూడా వసూళ్ల వర్షం కురుస్తుందని అందరూ భావించినా వాల్తేరు వీరయ్య దెబ్బకు వసూళ్లలో భారీ డ్రాప్ నమోదయింది. ఆ వివరాలు
Veera Simha Reddy Movie Day 2 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా సంక్రాంతికి సందర్భంగా జనవరి 12వ తేదీన వీర సింహారెడ్డి అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటిరోజు సంచలన వసూళ్లు సాధించిన క్రమంలో రెండో రోజు కూడా వసూళ్ల వర్షం కురుస్తుందని అందరూ భావించారు.కానీ ఈ సినిమా వాల్తేరు వీరయ్య ఎంట్రీతో వసూళ్ళలో వీరసింహారెడ్డి రెండో రోజు కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ చూడాల్సి వచ్చింది.
మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే పాతిక కోట్ల 35 లక్షల వసూలు చేయగా రెండో రోజు మాత్రం ఐదు కోట్ల 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఒకరకంగా చూసుకుంటే ఇది బాలకృష్ణ సినిమాకి భారీ దెబ్బ అనే చెప్పాలి. ఇక బాలకృష్ణ సినిమా రెండోరోజు వసూళ్ల విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో కోటి 61 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో కోటి 75 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 42 లక్షల వసూలు చేసిన ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో నలభై లక్షలు, వెస్ట్ గోదావరిలో 22 లక్షల వసూలు చేసింది.
ఇక గుంటూరు జిల్లాలో 36 లక్షలు కృష్ణాజిల్లాలో 34 లక్షలు, నెల్లూరు జిల్లాలో 15 లక్షలు వెరసి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో గాను ఐదు కోట్ల 25 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 9 కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండు రోజులకు గాను ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల 60 లక్షల షేర్, 48 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఇక కర్ణాటక సహా మిగతా దేశం మొత్తం మీద రెండు కోట్ల 35 లక్షలు, ఓవర్సీస్ లో నాలుగు కోట్ల 25 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల 20 లక్షల షేర్, 61 లక్షల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 73 కోట్లకు జరగడంతో బ్రేక్ ఈవెని టార్గెట్ 74 కోట్లుగా నిర్ణయించారు. సినిమాకి ఇంకా 36 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకి థియేటర్ల కౌంట్ పెరిగితే తప్ప ఆ స్థాయి టార్గెట్ అందుకోవడం కష్టమనే చెప్పాలి.
నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Waltair Veerayya Collections: మెగాస్టార్ కు మాస్ మహా రాజా తోడైనా.. ఆ సినిమా వసూళ్లను దాట లేకపోయిందే?
Also Read: BVS Ravi Movies: పూర్తిగా కమెడియన్ గా మారిపోతున్న డైరెక్టర్.. అన్ని సినిమాల్లో అదే తరహా పాత్రలు!