Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: తెలుగులో ఇద్దరు బడా హీరోలు, నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీ విడుదలయితే మెగాస్టార్ చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో దొరికిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడమే గాక ఒకే హీరోయిన్ నటించడంతో రెండు సినిమాల మీద అన్ని విషయాలలోనూ కంపారిజన్లు బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒక వారం థియేట్రికల్ రన్ పూర్తి కాగా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒక సారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.


ముందుగా వీర సింహా రెడ్డి వారం రోజుల వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా ఏడూ రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల 51 లక్షల షేర్, 94 కోట్ల 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీర సింహా రెడ్డి వారం రోజులకి కర్ణాటక సహా మిగతా భారతదేశంలో నాలుగున్నర కోట్లు వసూలు చేస్తే ఓవర్సీస్ లో ఐదున్నర కోట్లు వసూలు చేసింది. అలా వీర సింహారెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 68 కోట్ల 51 లక్షల షేర్ వసూలు చేస్తే 114 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.


ఇక అదే వారం రోజుల్లో వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏడు రోజుల్లో గట్టిగానే వసూలు చేసింది. 79 కోట్ల 86 లక్షల షేర్ 129 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఏడు రోజుల్లో కర్ణాటక సహా మిగతా భారత దేశంలో ఆరు కోట్లు రాబడితే ఓవర్సీస్ లో 10 కోట్ల 60 లక్షలు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల 46 లక్షల షేర్ 165 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఒక రకంగా చూస్తే బాలకృష్ణ సినిమా కంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా సుమారుగా 30 కోట్ల ప్లస్ లో ఉంది. చిరు సినిమాలో రవితేజ కూడా ఉండడంతో ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.


నోట్: ఈ సమాచారం వివిధ బాధ్యత మాల ద్వారా మేము సేకరించినదే కానీ దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు
Also Read: Waltair Veerayya Collections: 100 కోట్లకు చేరువలో వాల్తేరు వీరయ్య.. ఇంకా ఎంత వసూలు చేయాలంటే?


Also Read: VSR vs WV Collections: 'వీర సింహా'న్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తున్న వీరయ్య.. ఏకంగా అన్ని కోట్లు తేడానా?