Veera Simha Reddy Us Rights Vs Waltair Veerayya Us Rights: 2023 సంక్రాంతి అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది, దానికి కారణం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ ఉండటమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం. తొలుత రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది కాబట్టి రెండిట్లో ఒకే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ అటు బాలకృష్ణ ఇటు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు వెనక్కి తగ్గకపోవడంతో ఈ సినిమాల్ని సంక్రాంతి సీజన్ కి ఒకరోజు అటు ఇటుగా విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు, ఇక ఈ సినిమాకి సంబంధించిన యుఎస్ హక్కులు తాజాగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెండు సినిమాలను శ్లోకా సినిమాస్ అనే సంస్థ కొనుక్కున్నట్లుగా చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాకి మూడు కోట్ల 80 లక్షలు పెట్టి హక్కులకు శ్లోకా సినిమాస్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి మాత్రం ఏడు కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.


మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించడంతో ఎక్కువ రేటు పెట్టి ఆ సినిమా కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దిల్ రాజు వారసుడు అమెరికా హక్కులు కూడా ఇదే సంస్థ కొనుక్కున్నట్టు చెబుతున్నారు. వారసుడు సినిమాకి ఏకంగా ఐదు కోట్లు వెచ్చించి హక్కులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.


అలాగే మెగాస్టార్ చిరంజీవి రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా హక్కుల కేవలం 6  కోట్లకే కొనుక్కున్నారని అయితే ఒక కోటి ఎక్కువగా చెబుతున్నారని అంటున్నారు. కావాలని ఈ కోటి రూపాయలు ఎక్కువగా ఇన్ ఫ్లేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బాలకృష్ణ వీరసింహ రెడ్డి సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేస్తూ ఉండగా వాల్తేరు ఈ సినిమాకి బాబి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్ నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.


Also Read: Adireddy - Galata Geetu : ట్రాక్ తప్పిన గీతూ.. హెచ్చరించిన ఆదిరెడ్డి.. అతి మాత్రం తగ్గడం లేదుగా


Also Read: Bigg Boss Galata Geetu : నీది బొచ్చులో ఆట.. శిక్ష పడాల్సిందే.. గీతూ ఇజ్జత్ తీసిన నాగార్జున



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook