waltair Veerayya Pre Release Business : బాలయ్య, చిరు చేసిన బిజినెస్ ఎంతంటే?.. విజయ్, అజిత్‌ల టార్గెట్ ఎన్ని కోట్లంటే?
Veera Simha Reddy Pre Release Business నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల అంచనా బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 73 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.
Veera Simha Reddy vs waltair Veerayya సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలయ్యేలా ఉంది. చిరంజీవి, బాలకృష్ణలు భారీ టార్గెట్‌తో దిగుతున్నారు. సంక్రాంతి బరిలో ఈ సారి తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. బాలయ్య వీర సింహా రెడ్డితో వస్తే.. చిరు వాల్తేరు వీరయ్య అని వస్తున్నాడు. ఈ రెండింటిలో వీర అనేది మాత్రం కామన్‌గానే ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఇవి కాకుండా విజయ్ వారసుడు, అజిత్ తెగింపు కూడా అంచనాలు పెంచేశాయి.
సంక్రాంతి బరిలో అన్నింటి కంటే ముందుగా అజిత్ తెగింపు వస్తోంది. జనవరి 11న ఈ చిత్రం రాబోతోంది. ఆ తరువాత బాలయ్య రంగంలోకి దిగుతాడు. అంటే జనవరి 12న వీర సింహా రెడ్డి రాబోతోన్నాడు. అటుపై జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య అంటూ రెడీగా ఉన్నాడు. చివరగా జనవరి 14న విజయ్ వారసుడు రాబోతోన్నాడు. మరి ఇందులో ఏది ఎంత హిట్ అవుతుందో చెప్పలేం గానీ.. వాటి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
వీర సింహా రెడ్డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్లకు టార్గెట్‌తో దిగబోతోందట. 74 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుందన్న మాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య చేసిన బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి. నైజాంలో 15, సీడెడ్‌లో 13, ఉత్తరాంధ్రలో 9, ఈస్ట్ 5.2, వెస్ట్ 5, గుంటూరు 6.4, కృష్ణా 5, నెల్లూరు 2.7కోట్లకు అమ్ముడుపోయింది. ఇక ఈ చిత్రం 74 కోట్లు కొల్లగొడుతుందా? లేదా? అన్నది చూడాలి.
వాల్తేరు వీరయ్యతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రాబోతోన్నాడు. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఎంత బిజినెస్ చేసింది? .. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో ఏరియాలో ఎంతకు అమ్ముడు పోయిందో ఓ సారి చూద్దాం. ఈ సినిమా 88 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. 89 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుందట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు చేసిన బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి. నైజాంలో 18, సీడెడ్‌లో 15, ఉత్తరాంధ్రలో 10.2, ఈస్ట్ 6.5, వెస్ట్ 6, గుంటూరు 7.5, కృష్ణా 5.6, నెల్లూరు 3.2కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది.
అజిత్ తెగింపు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.2కోట్ల టార్గెట్‌తో దిగుతుంటే.. వారసుడు మాత్రం పద్నాలుగు కోట్ల టార్గెట్‌తో దిగుతోందట. మరి వీటిలో ఏది బ్రేక్ ఈవెన్ అవుతుంది.. ఏది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందన్నది చూడాలి.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి