This Week OTT Movie List ప్రతీ వారం కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. అయితే థియేటర్లో సినిమాల సందడి ఒకలా ఉంటే.. ఓటీటీలో ఇంకోలా ఉంటుంది. ఈ వారం థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ సందడి కనిపించబోతోంది. ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాలన్నీ ఒకే సారి రాబోతోన్నాయి. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీలో పోటి పడేందుకు రెడీగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్తేరు వీరయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. రొటీన్ కథ, కథనాలు అయినా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో అయితే ఏకంగా రెండున్నర మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాంటి ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.


బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమానే అయినా సంక్రాంతి బరిలో పర్వాలేదనిపించింది. బ్రేక్ ఈవెన్ మార్క్‌ను టచ్ చేసి హిట్టుగా నిలిచింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ చిరంజీవి సినిమాతో పోటీ పడుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 23 నుంచి ఓటీటీ(హాట్ స్టార్)లోకి రాబోతోంది. ఓటీటీలో చిరు, బాలయ్య సినిమాల మధ్య నాలుగు రోజుల గ్యాప్ పెట్టుకున్నారు.


వారసుడు సినిమాతో విజయ్ కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడిగాన.. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మూడొందల కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రాబోతోంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


సందీప్ కిషన్ మైఖేల్ సినిమా థియేటర్లో అంతగా మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలోకి ఈ మూవీ రాబోతోంది. మిస్టర్ కింగ్, థగ్స్ ఆఫ్ కోనసీమ వంటి చిన్న సినిమాలు థియేటర్లోకి రాబోతోన్నాయి.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook