విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు ( Kaliyuga Pandavulu ) ఆగష్టు 14, 1986 లో విడుదలైంది. అంటే సరిగ్గా ఈ సినిమా విడుదలై 34 ఏళ్లు అయ్యిందన్న మాట. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే టాలీవుడ్‌లో వెంకీ కెరీర్‌కి ఈ సినిమా రెడ్ కార్పెట్ వేసింది. ఈ చిత్రం 34 వ వార్షికోత్సవం సందర్భంగా, వెంకీ ట్విట్టర్‌లో తనకి ఈ అవకాశం ఇచ్చిన వారికి, తనతో కలిసి పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. Also read : SP Balu: నాకేం కాదు.. ఐసీయూలో ఎస్పీ బాలు థంబ్స్ అప్ ఫోటో వైరల్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కలియుగ పాండవులు సినిమా దర్శకులు కె రాఘవేంద్రరావు, వెంకీ తండ్రి రామానాయుడు, అలాగే సినిమాలో కో స్టార్‌గా నటించిన ఖుష్బూకు, సురేష్ ప్రొడక్షన్స్ టీంకి ఈ అందమైన అనుభవాన్ని తలుచుకుంటూ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన అభిమానులకు, మీడియాకి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సినీ పరిశ్రమకి చెందిన వారందరకీ వాళ్ల విషెస్, ఎల్లప్పుడూ వారిచ్చిన సపోర్టుకి ధన్యవాదాలు తెలిపారు.Also read : Indraprastham: చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై సినిమా టైటిల్ ఇదేనా ?