Nani: వెంకటేష్ కోసం రాసుకున్న కథలో నాని హీరో.. సినిమా ఎందుకు చేయలేదు చెప్పిన వెంకీ..
Hi Nanna: హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చాలా వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు హీరో నాని. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే వెంకటేష్ సైంధవ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. రెండు చిత్రం ప్రమోషన్లు ఒకేసారి సాగుతాయి అన్నట్టు.. నాని వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేశాడు.. ఇక ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.
Venkatesh : నాని చిత్రం హాయ్ నానా డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా వైవిధ్యంగా ప్లాన్ చేశారు నాని. ఇందులో భాగంగా ఈ మధ్యనే తన సినిమాతో పాటు యానిమల్ సినిమా కూడా ప్రమోట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అక్కడితో ఆగకుండా.. వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. హాయ్ నాన్న.. సైంధవ రెండు సినిమాలను ప్రమోట్ చెయ్యడానికి వెంకటేష్హస నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాని.. వెంకటేష్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే హాయ్ నాన్న.. సైంధవ రెండు సినిమాలు కూడా తండ్రీ కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్ర హీరోలు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానికి కూడా తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. అదేమిటి అంటే దర్శకుడు వెంకటేష్ కోసం రాసుకున్న కథలో నాని నటించేసారట. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా.. ఆ చిత్రం మరేదో కాదు నాని కెరియర్ లో ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిన జెర్సీ. ఆ సినిమాలో నాని నటన అద్భుతంగా చేశారని అప్పట్లో ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఆ చిత్రంలో రైల్వే స్టేషన్ సీన్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు. అంతలా హిట్ అయిన ఈ సినిమాలో నాని పాత్ర ఆ చిత్ర దర్శకుడు మాత్రం ముందుగా వెంకటేశ్ ని మనసులో పెట్టుకొని రాసారట.
కానీ ఎందుకో అది వెంకటేష్ కి సెట్ అవ్వలేదట.. దాంతో ఈ చిత్రం నాని వద్దకు వెళ్ళింది. కాగా ఈ విషయం వెంకటేష్ చెప్పేవరకు నాని కూడా తెలియదు. వీరిద్దరూ పాల్గొన్న ఇంటర్వ్యూలో నానికి వెంకటేష్ ఈ విషయం చెప్పాడు. జెర్సీ సినిమా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ తో తెరకెక్కింది. వెంకటేష్ క్రికెట్ ప్లేయర్ అని అందరికి తెలిసిందే. ఏదన్నా మ్యాచ్ జరుగుతూ ఉంటే తన అవకాశం ఉన్నప్పుడల్లా వెంకటేష్ అక్కడికి తప్పకుండా వెళుతూ ఉంటాడు. ఆ విషయం గుర్తు పెట్టుకొని జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ ఈ సినిమాని వెంకటేష్ కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాలవల్ల ఫైనల్ గా ఆ సినిమా నాని చేయాల్సి వచ్చింది. నాని కెరియర్ లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక చిత్రంగా మిగిలిపోయింది.
Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook