Venkatesh 75 title saindhav విక్టరీ వెంకటేష్ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెంకటేష్ గత ఏడాది ఎఫ్ 3, ఓరి దేవుడా వంటి సినిమాలతో పలకరించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్‌ తన కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్ అంటూ రాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమా మీద హైప్ పెంచేలా కనిపిస్తోంది. హై యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా రాబోతోన్నట్టుగా అనిపిస్తోంది. విక్రమ్‌లో కమల్ హాసన్ స్టైల్లో వెంకీమామ అదరగొట్టేట్టు కనిపిస్తోంది. గ్లింప్స్ వీడియోను చూస్తుంటే.. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోయేట్టు అనిపిస్తోంది.


వెంకటేష్ చేసిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు యాక్షన్ చిత్రాలు కాగా.. ఎఫ్‌ 3, ఓరి దేవుడా ఫన్ ఓరియెంటెడ్ చిత్రాలు. అన్ని సినిమాలు వెంకీమామకు హిట్టుగానే నిలిచాయి. వెంకీ మామ క్లాస్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు. అలాంటి వెంకటేష్ శైలేష్ కొలనుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.


హిట్ ఫ్రాంచైజీలతో అందరినీ మెప్పిస్తున్న శైలేష్‌ కొలను ఇప్పుడు వెంకీమామతో సైంధవ్ అంటూ రాబోతోన్నాడు. ఇది పాన్ ఇండియన్ రేంజ్‌లో రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా అటు వెంకటేష్‌కు ఇటు శైలేష్ కొలనుకు కలిసి వస్తుందా? అన్నది చూడాలి.


Also Read:  Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు


Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి