Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

Pawan Kalyan's Fan Died After Hitting His Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ని అనుసరించే క్రమంలో చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేయడం వల్ల వాహన శ్రేణిలోని ఒక వాహనానికి తగలడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్టు వార్తలొస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటికైతే స్పష్టత అయితే లేదు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ కానీ లేదా జనసేన పార్టీ వర్గాలు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 11:31 PM IST
Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

Pawan Kalyan's Fan Died After Hitting His Convoy: పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. కొండగట్టులో వారాహి వాహనానికి వాహన పూజ చేసుకున్న పవన్ కల్యాణ్ అనంతరం ధర్మపురి సందర్శించిన సంగతి తెలిసింది. ధర్మపురి పర్యటన పూర్తి చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అని నినాదాలు చేస్తూ తమ వాహనాల్లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ని ఫాలో అయ్యారు. 

ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మం. కిషన్ రావుపేట వద్ద ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిని ధర్మపురి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ని అనుసరించే క్రమంలో చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేయడం వల్ల వాహన శ్రేణిలోని ఒక వాహనానికి తగలడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్టు వార్తలొస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటికైతే స్పష్టత అయితే లేదు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ కానీ లేదా జనసేన పార్టీ వర్గాలు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Varahi Vehicle: కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

ఇది కూడా చదవండి : Pawan Kalyan Unstoppable Promo : దారుణంగా ఇరికించిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ ఏం చెబుతాడో

ఇది కూడా చదవండి : Mammootty in PSPK Film: పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్ముట్టికి విలన్ పాత్ర.. ఏమైందో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News