Venkatesh Upcoming Movies: ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ తో పాటు సినిమాలో నటించిన ఎందరో హీరోయిన్స్ తమ కెరీర్ లో మంచి సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరు చిత్రంలో త్రిష వెంకటేష్ తో కలిసి నటించింది. మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్లాసిక్ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో త్రిష నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ మూవీ తర్వాత త్రిషకు ఆఫర్స్ కూడా విపరీతంగా వచ్చాయి అనడంలో డౌట్ లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో వెంకటేష్ , త్రిష జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో సాంగ్స్ కూడా మంచి హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత 2009లో వచ్చిన నమో వెంకటేశా చిత్రంలో తిరిగి ఈ ఇద్దరు కలిసి నటించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. తిరిగి మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2012లో బాడీగార్డ్ అనే మూవీ వచ్చింది. అయితే ఈ చిత్రం కూడా సక్సెస్ అందుకోలేకపోయింది.


బాడీగార్డ్ మూవీ తర్వాత వెంకటేష్, త్రిష కాంబినేషన్లో మరి ఇంకో మూవీ రాలేదు.ఇటు  వెంకటేష్ తన కెరీర్లో బిజీగా ఉంటే అటు త్రిష కూడా తమిళ్ సినిమాల్లో బాగా బిజీ అయిపోయి తెలుగులో అడపాదడపా కనిపిస్తూ ఉండేది. 2022లో మణి రత్నం తర్కెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత త్రిషకు మళ్లీ పూర్వపు క్రేజ్ వచ్చింది. ఈ వయసులో కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఈ భామ బాగా బిజీ అయిపోతుంది. ప్రస్తుతం త్రిష డేట్స్ కూడా దొరకడం అంత సులభం కాదు అని టాక్. ఒకపక్క చిరంజీవితో విశ్వంభర ఉండగా..మరొక కమల్ హాసన్ తో, అజిత్తో మూవీలు ఉండనే ఉన్నాయి. వీటితోపాటుగా వెంకీ మామ హీరోగా..అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించబోయే కొత్త విలేజ్ డ్రామా మూవీకి కూడా త్రిషనే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు టాక్.


ఈ నేపథ్యంలో తిరిగి వెంకీ మామతో త్రిష మరొకసారి ఫ్రెష్ గా మూవీ చేయబోతోంది అని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల లో ఎక్కువ శాతం షూటింగ్ భాగం సమ్మర్ కి ఫినిష్ అయిపోతుందట. కాబట్టి త్రిష,వెంకీ మామతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది . ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం డైరెక్టర్లకు పెద్ద సవాలుగా మారుతుంది. 


కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్ర హీరోయిన్లను పెడితే సెట్ కావడం లేదు .ఈ నేపథ్యంలో త్రిష లాంటి హీరోయిన్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. అందుకే వెంకీ మామ చిత్రానికి త్రిష ఒకే అంటే..అనిల్ రావిపూడికి పెద్ద సమస్య తీరినట్టే అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ ఇద్దరి కాంబో మళ్లీ సెట్ అయితే..వెంకీ మామ ఖాతాలో సక్సెస్ పడుతుందేమో చూడాలి..


Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?


Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook