Venkatesh Remake: 'సైంధవ్' విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రం. ఈయన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా  నిలిచిపోతుందనుకున్న మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నజర్ పెట్టాడు.  తాజాగా ఈయన బాలీవుడ్‌లో హిట్టైన 'షైతాన్' మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. వెంకటేష్ విషయానికొస్తే.. ఎక్కడ మంచి కథలున్న వెంటనే తెలుగులో ఆయా సినిమాలను  రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. ఇపుడు అదే పనిచేయబోతున్నారు. దృశ్యం 2, నారప్ప సినిమాల తర్వాత ఇపుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. హిందీలో అజయ్ దేవ్‌గణ్ పోషించిన రోల్‌లో వెంకీ మామ నటించబోతున్నాడట. అటు మాధవన్ పాత్రను మాధవన్‌తోనే చేయాంచాలనే ఆలోచనలో ఉన్నాడట. గుజరాతిలో హిట్టైన 'వశ్' మూవీకి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సినిమాను తెలుగులో ఓ యంగ్ డైరెక్టర్‌తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు వెంకటేష్.. తనతో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ చేయబోతున్నాడు. ఇప్పటికే  అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసాడు. బాలయ్యతో 'భగవంత్ కేసరి' తర్వాత వెంకటేష్‌తో హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ చేయబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా  త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.


ఈ సినిమాను ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్‌తో  పూర్తి కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించబోతున్నారట. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' టైపులో ఈ సినిమా ఉండనున్నట్టు సమాచారం.  ఇందులో ఒక హీరోయిన్‌గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేది చూడాలి.  ఈ సినిమాకు 'సంక్రాంతి వస్తున్నాం' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట. వెంకీతో చేసే మూవీ కోసమే ఈ పేరును రిజిస్టర్ చేసినట్టు సమాచారం. మొత్తంగా టైటిట్ విచిత్రంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు పెళ్లాల మధ్య నలిగే భర్త పాత్రలో కనిపించనున్నాడట. మన చట్టాల ప్రకారం ఒక భార్య ఉండగా.. మరో భార్యను పెళ్లి చేసుకోవడం నేరం. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం కానీ.. ఆమె ఒప్పకుంటే కానీ రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. మన సినిమాల్లో హీరో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తుంటారు. ఇపుడు వెంకటేష్‌తో  చేయబోతున్న సినిమాలో అదే కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తాడా.. లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహా శివరాత్రికి అనుకన్నారు. కానీ ఉగాది రోజున ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట.  అంతేకాదు ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నాడట. 


వెంకటేష్ నటించిన 'సైంధవ్'  విషయానికొస్తే..  ఈ ఇయర్ పొంగల్ కానుకగా విడుదలైంది. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. సంక్రాంతి సినిమాల్లో పూర్తిగా నలిగిపోయింది.  విడుదలైన ఒక రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాప చుట్టేసింది. 'అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో పాటు నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలతో పోటీగా విడుదలైంది. ఈ సినిమాల మధ్య సైంధవ్ పూర్తిగా నలిగిపోయింది. మొత్తంగా  ఈ సినిమా ప్రీ  రిలీజ్ బిజినెస్ కంటే సగంలో సగం కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది.


Also Read: CAA Implement: మోదీ ప్రభుత్వం సంచలనం.. ఎన్నికల వేళ సీఏఏ అమలుకు నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook