వెంకటేష్ 60వ బర్త్ డే కానుకగా వెంకీ నటిస్తున్న కొత్త సినిమా నారప్ప మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్సే విడుదల కానుంది.  డిసెంబర్ 12న.. అంటే ఇవాళ వెంకీ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులను ఎంటర్‌టైన్ చేసి అలరించేందుకు నారప్ప మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే నారప్ప సినిమా విశేషాలను తెలియజేస్తూ ఇవాళ రాత్రి 8 గంటలకు నారప్ప టీజర్ వీడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నారప్ప సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ జరుగుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోలీవుడ్‌లో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సినిమాకు తెలుగు రీమేక్ వెర్షన్‌గా ( Asuran Telugu remake ) తెరకెక్కుతున్న సినిమా ఇది. పల్లెటూరిలో ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో పాటు కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో మంజు వారియర్ నటించిన పాత్రను తెలుగులో ప్రియమణి పోషిస్తోంది ( Priyamani reprises Manju Warrier’s role ). 


Also read : Jr NTR to host MEK season 5: మరోసారి హోస్ట్‌గా రానున్న జూనియర్ ఎన్టీఆర్


వెంకీ బర్త్ డే నాడు నారప్ప యూనిట్ అందిస్తున్న ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ నారప్ప టీజర్ వీడియోనే ( Narappa movie teaser ) లేక మరొకటా అనేది తెలియాలంటే ఇవాళ రాత్రి 8 గంటల వరకు వేచిచూడాల్సిందే.


Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook