Chaari 111 OTT News: వెన్నెల కిషోర్.. అంటే కామెడీకి కేరాఫ్‌ అడ్రస్ అని చెప్పాలి. డిఫరెంట్ మాడ్యులేషన్.. ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కమెడియన్ అయ్యారు.
ఈయన డైలాగ్స్ మధ్యలో ఇంగ్లీష్ పదాలతో కామెడీని పండించడం వెన్నెల కిషోర్ స్లైల్. తాజాగా ఈయన హీరోగా 'చారి 111' మూవీతో పలకరించారు. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసిన కుర్చీలో పడిపడి నవ్వారు. కానీ ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. చారి.. బ్రహ్మచారి.. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేస్తుంటాడు.
1992లో ఎటువంటి  బయలాజికల్, కెమికల్ వెపన్స్ తయారు చేయకూడదని భారత్, పాకిస్థాన్ జాయింట్ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాయి. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఎలా అతిక్రమించింది. దాన్ని మన ఏజెంట్ రుత్ర ఎలా బయటపెట్డాడనేది ఎంతో ఫన్నీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ పాల్లు చూసి ఎంచక్కా హాయిగా నవ్వుకోవచ్చు.

 


ఈ సినిమాలో 'వెన్నెల' కిశోర్ సరసన  సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించింది. టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేశారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. మురళీ శర్మ మరో లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. మరి థియట్రికల్‌గా అంతగా మెప్పించని ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


Also read: Qatar government: ఆ 8 మందికి క్షమాభిక్ష, విడుదల చేసిన ఖతార్ దేశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook