OMG Movie Pre Release Event: నవిస్తూనే భయపెట్టేందకు OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ రెడీ అయింది. హార్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మించారు. జూన్ 21న ఆడియన్స్ ముందుకు రానుండగా.. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్స్, డైలాగ్స్‌‌లో సహాయం చేసిన తన డైరెక్షన్ టీమ్‌కు, మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానాకు థాంక్స్ చెప్పారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిందన్నారు. జూన్ 21న తమ రాబోతోందని.. ప్రేక్షకులు అందరూ చూడాలని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jr NTR: ఏ ఏరియాలో ఎన్టీఆర్ తోపు .. దటీజ్ తారక్..


ప్రొడ్యూసర్ డా.అబినికా ఇనాబతుని మాట్లాడుతూ.. నిర్మాతగా తనకు ఇది మొదటి సినిమా అని.. డైరెక్టర్ శంకర్ ఎంత బాగా కథ చెప్పారో అంతకు మించి అనేలా సినిమాను తీశారని చెప్పారు. జూన్ 21న సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలని కోరారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో డైరెక్టర్ శంకర్ ఈ కథను చెప్పారని.. అప్పుడు చిన్నగా అనుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్ మధ్య సీన్లు బాగా వచ్చాయని.. హార్రర్, కామెడీ మిక్స్ చేసి బాగా తీశారని మెచ్చుకున్నారు. అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. 


నందితా శ్వేత మాట్లాడుతూ.. తనకు కామెడీ అంటే చాలా ఇష్టం అని.. శంకర్ తనకు ఈ కథను చెప్పినప్పటి నుంచి షూటింగ్ కోసం ఎంతో ఆసక్తితో ఉన్నానని చెప్పారు. కథ చెప్పే సమయంలో నవ్వుతూనే ఉన్నానని అన్నారు. హార్రర్, కామెడీ జానర్లతో రాబోతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చన్నారు. తమకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు నటులు  నవమి గాయక్, నవీన్ నేని థాంక్స్ చెప్పారు. సెట్స్‌లో అల్లరి చేస్తూ షూటింగ్ చేశామన్నారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసి హాయిగా నవ్వుకుని వెళ్లాలని కోరారు.


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter