Vennela Kishore Responds: శర్వా నా కొడుకున్నాడు, మంచు విష్ణు అహంకారన్నాడు.. పాపం వెన్నెల కిషోర్ బాధ విన్నారా?
Vennela kishore responds on manchu vishnu and Sharwanand comments: వెన్నెల కిషోర్ మీద హీరోలు శర్వానంద్, మంచు విష్ణు చేసిన కామెంట్ల విషయంలో ఆయన స్పందించారు. ఆ వివరాలు
Vennela kishore responds on manchu vishnu and Sharwanand comments: కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెన్నెల సినిమా షూటింగ్ సమయంలో శివారెడ్డి వీసా ఇబ్బందులతో అమెరికా వెళ్లకపోవడంతో శివారెడ్డి పాత్రలో నటించిన కిషోర్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు టాలీవుడ్ లో కమెడియన్ స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా వెన్నెల కిషోర్ లేకుండా అయితే దర్శక నిర్మాతలు ట్రాక్ రాసుకోవడం లేదు.
దాదాపు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉండడంతో వెన్నెల కిషోర్ అన్ని సినిమాలకు అత్యవసరం అయిపోయాడు. దీంతో ఆయనకు షూటింగ్ తప్ప మరో లోకం ఉండటం లేదట. తాజాగా జిన్నా సినిమాలో కూడా ఆయన నటించారు. మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కనపడక పోవడంతో మంచు విష్ణు వెన్నెల కిషోర్ గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
వెన్నెల కిషోర్ చాలా అహంకారి, అని అహంకారం ముందు పుట్టి తర్వాత వెన్నెల కిషోర్ పుట్టాడా అనిపిస్తూ ఉంటుంది. కానీ అతను నాకు బాగా క్లోజ్ కావడంతో అతనిని ఏమీ అనలేక పోతున్నాను అని అన్నాడు. అసలు ఇంత హడావుడి ఎందుకంటే వెన్నెల కిషోర్ నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకపోవడం వల్ల. అయితే కొద్ది రోజుల క్రితం ఒకే ఒక జీవితం సినిమా ఈవెంట్ సమయంలో కూడా ఆయన కన పడకపోవడంతో హీరో శర్వానంద్ కూడా ఆ నా కొడుకు వెన్నెల కిషోర్ గాడు మిస్ అయ్యాడు సినిమా వాడికి ఇప్పిస్తే ఇలా హ్యాండ్ ఇచ్చాడు అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
తాజాగా ఈ రెండు ఘటనలు దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక జీవితం సక్సెస్ ప్రెస్ మీట్ లో వెన్నెల కిషోర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మీరేమో ఆ నా కొడుకు రాలేదంటారు ఇంకొక హీరో అహంకారి అంటున్నాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావడం లేదు అంటూ వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. మీరు ఒకటి అంటారు, యూట్యూబ్ వాళ్ళు దాని వంద రకాలుగా ప్రచారం చేస్తారని అన్నారు. నా స్నేహితులు థంబ్ నైల్స్ చూసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టి ఫోన్లు చేస్తున్నారు, చివర్లో లవ్ యు డార్లింగ్ అని వినీ వినపడకుండా చెప్పాడు.
దాన్ని మాత్రం ఎవరూ వినరు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శర్వానంద్ కల్పించుకొని అదేమీ లేదని నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తే, నేను ఆరోజు ఏ సినిమా షూటింగ్లో ఉన్నాను ఎందుకు రాలేకపోయాను కూడా నీకు తెలుసు కానీ మీడియా ముందు ఆ నా కొడుకు అన్నావు అంటూ వెన్నెల కిషోర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Also Read: Sreemukhi Hot Photos: శ్రీముఖి పరువాల విందు.. సూటేసింది కానీ అన్నీ కనిపించేలా రచ్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి