Junior Mehmood Passes away: హిందీ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జూనియర్‌ మెహమూద్‌ (Junior Mehmood) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన 67 ఏళ్ల వయసులో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మెహమూద్‌ అసలు పేరు నయీమ్ సయ్యద్. అయితే బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మెహమూద్‌ని తలపించేలా యాక్టింగ్ చేస్తుండటంతో ఆయన్ని అంతా జూనియర్ మెహమూద్‌గా పిలుస్తుంటారు. శాంతాక్రూజ్ వెస్ట్‌లోని జుహు ముస్లిం స్మశానవాటికలో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూనియర్‌ మెహమూద్‌ కొన్ని రోజులగా కాలేయం, ఊపిరితిత్తులలో క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇది నాలుగో స్టేజ్ లో ఉంది. తాజాగా ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ''మొహబ్బత్ జిందగీ హై" (1966), "నౌనిహాల్" (1967) చిత్రాలతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఏడు భాషలలో 250కు పైగా చిత్రాల్లో నటించాడు. మెహమూద్.. బ్రహ్మచారి, కటి పతంగ్, హరే రామ హరే కృష్ణ, అజ్ కా అర్జున్, మేరా నామ్ జోకర్, పర్వరిష్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 


Also Read: Niharika: 'హాయ్ నాన్న’కు రివ్యూ ఇచ్చిన నిహారిక.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook