Niharika: 'హాయ్ నాన్న’కు రివ్యూ ఇచ్చిన నిహారిక.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్

Hi Nanna: నాని హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా హాయ్ నాన్న.. ఎమోషనల్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం నిన్న డిసెంబర్ 7న విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేసింది మెగా డాటర్ నిహారిక. మరి తను ఈ చిత్రం గురించి ఏమంటుందో ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 07:17 AM IST
Niharika: 'హాయ్ నాన్న’కు రివ్యూ ఇచ్చిన నిహారిక.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్

Hi Nanna Review: కొత్త దర్శకులను.. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో హీరో నాని ఎప్పుడూ ముందుంటారు. కాదా అలాంటి నాని మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ తీసిన సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న విరుదలైన ఈ మూవీకి డిసెంబర్ 6న ప్రీమియర్ వేశారు. ఈ షోకు సెలెబ్రిటీలు వచ్చారు. ఇక ఆ ప్రీమియర్ లో ఈ చిత్రం చూసిన వారంతా ఈ సినిమా చాలా బాగుంది అని రివ్యూలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక ఈ ప్రత్యేక ప్రీమియర్ షో కి యూట్యూబర్ నిఖిల్, రేణూదేశాయ్, నిహారిక, సునీత  ఇలా చాలా మంది సెలెబ్రిటీలు అటెండ్ కావడం విశేషం. దాంతో ఈ సినిమా గురించి ఒకరి తర్వాత ఒకరు చాలా పాజిటివ్ గా తమ సోషల్ మీడియా అకౌంట్ లో రివ్యూలు పెడుతున్నారు.

ముఖ్యంగా మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక ఈ సినిమాని చూసి బాగా ఎమోషనల్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం చూడగానే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన రివ్యూ కూడా చెప్పేసింది. ఈ మూవీ గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదంటూ ఫుల్ ఎమోషనల్ అయింది నిహారిక.

‘ నాని హాయ్ నాన్న సినిమా నాకు ఎలా అనిపించిందో చెప్పడానికి మాటలు చాలడం లేదు.. మీరందరూ కూడా ఈ అద్భుతమైన సినిమాను చూడండి.. మీకు మీరే ఓ మంచి చేసుకున్నట్టు అవుతుంది.. ముఖ్యంగా నాని అద్భుతంగా నటించేశాడు. మృణాల్, కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం ఇలా అందరూ అద్భుతంగా పర్ఫామన్స్ ఇచ్చారు.. ఇక మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు.. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం నా మనసుని దోచింది.. శౌర్యువ్ నేను ఇది నీకు అబద్దం చెప్పడం లేదు.. నువ్వొక మాంత్రికుడువి.. ఈ ఇండస్ట్రీలో నీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది.. నీ నెక్ట్స్ మూవీ గురించి వెయిటింగ్.. నా మనసు సంతోషంతో నిండిపోయింది’ అంటూ ఈ సినిమాకి తెగ పాజిటివ్ రివ్యూ ఇచ్చేసింది నిహారిక.

కాగా ఈ సినిమాపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులు చూస్తే నాని హాయ్ నాన్న అందరినీ ఆకట్టుకునే ఎమోషనల్ సినిమా అని అర్థమవుతుంది. మరి ఈ చిత్రం దసరా లాంటి మాస్ సినిమా తరువాత నానికి ఒక క్లాస్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News