SSMB29 Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో.. సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా.. రేంజ్ లో విడుదల కాబోతున్న..ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ నటుడు నాజర్ కూడా ఈ సినిమాలో ఒక భాగం కాబోతున్నట్లు సమాచారం. అయితే సినిమాలో ఆయన పాత్ర ఉంటుందో.. లేదో.. తెలియదు కానీ నాజర్ చిత్ర బృందానికి సహాయపడనున్నారు. యాస, కొన్ని పదాలు ఎలా పలకాలి అనే వాటి మీద..నాజర్ మహేష్ బాబు కి వర్క్ షాప్ ఇవ్వనున్నారట. 


ఏదేమైనా సినిమా ప్రీ ప్రొడక్షన్ కి అనటం మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. దీంతో మహేష్ బాబు అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. నాజర్ మహేష్ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. మహేష్ బాబు కి నాజర్ చాలా కాలంగా తెలుసు.
ఇద్దరు కలిసి పలు సినిమాల్లో.. కూడా నటించారు. ముఖ్యంగా పోకిరి సినిమాలో నాజర్.. మహేష్ బాబు తండ్రి పాత్రలో.. కనిపించారు. అతడు సినిమాలో కూడా మహేష్ బాబు.. నాజర్ మధ్య మంచి సన్నివేశాలు ఉంటాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి సినిమా.. కోసం ఈ ఇద్దరు కలిసి పని చేయనున్నారు. 


ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. కానీ అధికారిక ప్రకటనలు మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి. ప్రముఖ మలయాళం ఈ సినిమాలో.. విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.


సినిమాకి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. సినిమా ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అని హింట్ ఇచ్చారు. మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ మీద చాలానే.. అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో రాజమౌళి రికార్డులు బ్రేక్ చేస్తారు.. అని మహేష్ బాబు అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని పైన ఇంకా సస్పెన్స్ వీరలేదు. చాలావరకు ఈ చిత్రం.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. ఆగస్టు 9వ తేదీన మొదలవ్వచ్చు అని వినికిడి. ఈ విషయంలో నిజం తెలియాలి అంటే.. వచ్చే నెల వరకు వేచి చూడాల్సిందే.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి