Tatineni Ramarao: దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత.. అప్పట్లోనే ఆయనది ప్యాన్ ఇండియా రేంజ్..
Tatineni Ramarao Passes Away: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు చెన్నైలో కన్నుమూశారు.
Tatineni Ramarao Passes Away: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత తాతినేని రామారావు (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 19) అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన ఆయన ఒకరకంగా అప్పట్లోనే ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
1950ల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రామారావు.. ఆ తర్వాతి కాలంలో దర్శకుడిగా మారారు. 1966లో దర్శకుడిగా తొలి సినిమా 'నవరాత్రి' తీశారు. ఇది తమిళ సినిమాకు రీమేక్. ఆ తర్వాత బ్రహ్మచారి, మంచి మిత్రులు, సుపుత్రుడు, రైతు కుటుంబం, జీవన తరంగాలు, దొరబాబు, యమగోల, ఆలు మగలు, అమర ప్రేమ, శ్రీరామ రక్ష సినిమాలు తీశారు. తెలుగులో దర్శకుడిగా ఆయన చివరి సినిమా 'గోల్‌మాల్ గోవిందం'. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరో.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, హిందీలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అజయ్ దేవగణ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటీనటులతో రామారావు సినిమాలు తీశారు. గోవింద, రంభ జోడీగా తెరకెక్కించిన 'బేటీ నంబర్ 1' హిందీలో ఆయన చివరి చిత్రం.
తాతినేని రామారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం పట్ల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సహా పలువురు సంతాపం ప్రకటించారు. రామారావు కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. ఆయన ఎన్టీఆర్‌కు సమీప బంధువుగా చెబుతారు. సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడి కన్నా ముందు ప్రకాశ్‌రావు, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా ఏళ్లు పనిచేశారు.
Also Read: Horoscope Today April 21 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..
Also Read: Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్! ట్విస్ట్ ఏంటంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook