Viduthalai Part 1 Telugu Release: తమిళ్లో సూపర్ హిట్ అయిన `విడుతలై`.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే..?
Vijay Sethupathi Viduthalai Part 1 in Telugu: వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విదుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళనాడు సహా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో తమిళంలో విడుదలవగా తెలుగు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిందని తెలుస్తోంది.
Vijay Sethupathi's Viduthalai Part 1 Telugu Release Date: ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒక భాషలో రూపొందిన సినిమా అక్కడ సూపర్ హిట్ అయితే ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళంలో విలక్షణ డైరెక్టర్ గా పేరున్న వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విదుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళనాడు సహా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో తమిళంలో విడుదలైంది.
విడుదల పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకి మంచి స్పందన మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటించడం గమనార్హం. అలా విడుదలైన ఈ విడుతలై సినిమా మొదటి రోజు 8 కోట్లు రాబట్టింది అంటే ఎంతగా జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రశంసలు మాత్రమే కాదు బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకు పోతోంది.
ఇక ఇంతకు ముందు వరకు సైడ్ క్యారెక్టర్స్‌లో నటించిన సూరి కుమరేశన్ క్యారెక్టర్ ద్వారా సాలిడ్ యాక్టర్‌గా లీడ్ గా నిలదొక్కుకునేలా కనిపిస్తున్నాడు. ఇక తెలుగు మాట్లాడే వారంతా తమిళ సినిమాలు సైతం ఆరాధిస్తారు. అందుకే తమిళంలో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విదుతలై పార్ట్ 1 తెలుగు వెర్షన్ రిలీజ్ కోసం విజయ్ సేతుపతి, వెట్రిమారన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్. అదేమంటే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. విదుతలై పార్ట్ 1 సినిమాలో కుమరేశన్‌గా సూరి, పెరుమాళ్ అకా వాతియార్‌గా విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, ఇళవరసు, మున్నార్ రమేష్, శరవణ సుబ్బయ్య, మరియు బాలాజీ శక్తివేల్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సినిమాటోగ్రాఫర్-దర్శకుడు రాజీవ్ మీనన్ లు కూడా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమా మొత్తానికి సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు.
Also Read: Dil Raju Complaint: బలగం సినిమాపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు.. అసలు విషయం ఏమిటంటే?
Also Read: Dasara Movie: ఏం సినిమారా బాబూ.. దసరా గురించి ప్రభాస్ పోస్ట్ వైరల్!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook