Dil Raju Complaint: బలగం సినిమాపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు.. అసలు విషయం ఏమిటంటే?

Dilraju Police Complaint on Balagam: తమ బలగం సినిమాను కొందరు యాంటీ సోషల్ వ్యక్తులు అక్రమంగా ప్రదర్శిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 2, 2023, 10:27 PM IST
Dil Raju Complaint: బలగం సినిమాపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు.. అసలు విషయం ఏమిటంటే?

Dilraju Police Complaint on Balagam Projections: ఇటీవల బలగం సినిమాతో హిట్టు కొట్టిన దిల్ రాజు ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. దానికి కారణం బలగం సినిమాని కొన్నిచోట్ల బహిరంగంగా ప్రదర్శించడమే. అదేంటి ఆయన కుమార్తె స్వయంగా ఆయన పేరు మీద ప్రారంభించిన ప్రొడక్షన్స్ లో చేసిన మొదటి సినిమా ప్రదర్శనలు జరుగుతుంటే దిల్ రాజు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఇలా ఫీల్ అవ్వడం ఏమిటి? అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటి? అనుకుంటున్నారా? అయితే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

వాస్తవానికి తెలంగాణ నేపథ్యంలో బలగం సినిమాని కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించారు.. ఈ సినిమాని దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో నిర్మించారు. మార్చి మూడో తేదీన విడుదలైన ఈ సినిమాని మార్చి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రసారం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు ఈ సినిమాని ఊరి మధ్యలో ప్రొజెక్షన్ తెరలు ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ఈ విషయం చూసి చాలా మంది సినీ అభిమానులు సంబరపడుతున్నారు. ఒకప్పటి కల్చర్ ని మరోసారి ఈ సినిమా తీసుకువచ్చిందని ఆనందపడుతుంటే దిల్ రాజు మాత్రం ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోకి దిల్ రాజు సంస్థ అమ్మేసింది. ఈ నేపథ్యంలోనే బలగం మూవీ అమెజాన్లో ప్రసారమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూల్స్ ప్రకారం సినిమాని ఇలా ఒకేసారి ఇంత మందికి ప్రాజెక్ట్ చేసి చూపించడం కరెక్ట్ కాదట.

ఈ నేపద్యంలోనే ఈ విషయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ అంశం మీద పలువురు తెలంగాణ వాదులు దిల్ రాజు మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మన సినిమాని మన ప్రాంతం ప్రజలు ఇంటిల్లిపాది ఊరుతో సహా కలిసి చూస్తుంటే మీకు వచ్చిన సమస్య ఏమిటి? అన్ని విషయాల్లోనూ వ్యాపారంతో ఆలోచిస్తారా? ఎందుకిలా చేస్తున్నారు? అంటూ ఆయన మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయం మీద దిల్ రాజు కానీ ఆయన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ కానీ ఏమైనా స్పందిస్తుందేమో వేచి చూడాల్సి ఉంది.
Also Read: Vijay Devarakonda: ఖుషీ మీదే విజయ్ దేవరకొండ ఫోకస్..మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది?

Also Read:Agent Release Date: ఏజెంట్ రిలీజ్ డేట్ టెన్షన్.. దర్శక-నిర్మాతల మధ్య దూరం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News