Vetrimaran Comments on Jr NTR Movie: తమిళంలో విలక్షణమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ తాజాగా విడుదలై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని తెలుగులో విడుదల పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాదులో ప్రెస్ కోసం ఒక స్పెషల్ ప్రీమియర్ వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత ప్రెస్ మీట్ లో వెట్రిమారన్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోందని అది మల్టీస్టారర్ అని కూడా గతంలో చాలా ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని ఆయన ముందు ప్రస్తావిస్తే ఆయన ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. గతంలో తెలుగు హీరోలను ఎవరెవరిని తాను కలిశాననే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.


ఇది కూడా చదవండి: ​Nani Vs Raviteja: 'రావణాసుర' కలెక్షన్స్ కబ్జా చేస్తున్న దసరా.. డామినేషన్ అంటే ఇదేనేమో?


ఆడుకాలం అనే సినిమా చేసిన తర్వాత తాను అల్లు అర్జున్ ఒకటి రెండుసార్లు కలిశామని, తాను తమిళ్ లో సినిమా చేయాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కథ చెప్పండి అని అల్లు అర్జున్ అడిగారని ఆ సమయంలో తాను ధనుష్ తో చేసిన వడ చెన్నైలోని ఒక పవర్ఫుల్ పాత్ర గురించి ఆయనకు చెప్పానని కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదని అన్నారు. ముందుగా అనుకున్న వెర్షన్ లో ఆ పాత్ర ఉంది కానీ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.


అదే సమయంలో మహేష్ బాబుని కలిసి ఒక కథ చెప్పానని ఆ కథ ఆయనకు నచ్చినా ఎందుకో అది కూడా సినిమాగా సెట్స్ వరకు వెళ్లలేదని అన్నారు. ఇక ధనుష్తో చేసిన అసురన్ సినిమా తర్వాత లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ ను కలిశానని ఆ సమయంలో తామిద్దరం అనేక విషయాలు మాట్లాడుకున్నామని అన్నారు. ఆయనతో తాను ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటూనే దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


అలాగే అది ఆయనతో సోలో హీరోగా సినిమా ఉంటుందా? లేక మల్టీస్టారర్ సినిమా ఉంటుందా? అనే విషయాన్ని కూడా కాలమే సమాధానం చెప్పాలని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా స్టార్ వాల్యూ, కాంబినేషన్ వాల్యూ అని కాకుండా తాను ఎంచుకునే కంటెంట్ ఫలానా స్టార్ కావాలని డిమాండ్ చేస్తేనే ఆ స్టార్ తో సినిమా చేస్తానని వెట్రిమారన్ కామెంట్లు చేశారు.


ఇది కూడా చదవండి: Mogilaiah health: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. అత్యంత విషమంగా పరిస్థితి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook