Vettaiyan Pre Release Business: ఒకపుడు రజినీకాంత్ సినిమా వస్తుందంటే.. తమళంలో కంటే తెలుగులోనే ఎక్కువ హడావుడి ఉండేది. ఆయన సినిమాలకు పోటీగా బడా హీరోలు సైతం సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకడుగు వేసేవారు. కానీ కాలం మారింది. దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్టే రజినీకాంత్ ఇమేజ్ కు కూడా ఎక్స్ పైరీ డేట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళంలోనే ఆయనకు మార్కెట్ ఉంది. తెలుగులో గతంలో లాగా చొక్కాలు చించుకునే అభిమానులు అయితే లేరనే చెప్పాలి. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘వేటయ్యన్’ సినిమాకు తెలుగు టైటిల్ పెట్టే ఓపికా తీరికా లేవు. దీంతో కొంత మంది వీరాభిమానులు ఆయన్ని సోషల్ మీడియా వేదికగా తిట్టారు. తీరా తెలుగులో ప్రచారాం చేద్దామనుకుంటే.. ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఏది ఏమైనా తెలుగులో లో బజ్ తో ఈ సినిమా రిలీజైవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాక్ బాగుంటే.. మాత్రం ఈ సినిమాను ఆపడం ఎవరి తరం కాదు. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ రూపేణా $ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తమిళంతో పాటు మిగతా భారత దేశంలో దాదాపు రూ. 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు రూ 30 కోట్ల షేర్ (రూ. 60 కోట్ల గ్రాస్) వరకు రాబట్టే అవకాశాలున్నాయి.


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..


ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి దాదాపు రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ (నైజాం)లో రూ. 8 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) రూ. 2 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో రూ . 7 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే రూ. 18 కోట్ల షేర్ రాబట్టాలి.


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తమిళనాడు - రూ. 73 కోట్లు..
తెలుగు రాష్ట్రాలు.. 17 కోట్లు..
కర్ణాటక + కేరళ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి - రూ. 25 కోట్లు..
ఓవర్సీస్ - రూ. 45 కోట్లు..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 162 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా టాక్ బాగుంటే మాత్రం ఈ సినిమాకు వసూళ్లు అదిరిపోతాయనే చెప్పాలి.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


‘వేటయ్యన్’ సినిమా విషయానికొస్తే.. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.  జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. విజయ దశహి కానుకగా ఈ సినిమా అక్టోబ‌ర్ 10న వరల్డ్ వైడ్ గా  ప్యాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో అమితాబ్ బ‌చ్చ‌న్‌,రానా ద‌గ్గుబాటి, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు యాక్ట్ చేశారు.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter