బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kanganan Ranaut ) ముంబై సినీ పరిశ్రమపై విరుచుకుపడటం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singn Rajput ) మరణం తరువాత బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. బాలీవుడ్ లో పక్షపాతం, నెపోటిజం ( Nepotism ) బాగా ఉంది అని ఆమె చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపాయి. దాంతో పాటు సుశాంత్ ఆత్మహత్య గురించి ఆమె ఎన్నో వ్యాఖ్యాలు చేశారు.



ఈ మధ్య ముంబైలో రాజీకీయంగా కూడా ఆమెకు బెదిరింపులు వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కంగనాకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ ( Y Plus Security ) సెక్యూరిటీని కల్పించింది. 


తాజాగా ఆమె ఒక ఎయిర్ పోర్టులో కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ ( Viral Video ) అవుతోంది. ఇందులో ఆమె కారు దిగడానికి ముందే సుమారు 13 మంది సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వేచి చూస్తుంటారు. ఆమె కారు దిగగానే అమెను చుట్టూ ఒక రక్షణ వలయం మానవహారం ఏర్పాటు చేస్తారు. కంగానా ప్రశాంతంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది.




ఈ వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ అయినప్పటి నుంచి నెటిజెన్స్  ( Netizens ) మిశ్రమంగా స్పందిస్తున్నారు. కంగనాకు అంత సెక్యూరిటీ అవసరమా అని కొంత మంది కామెంట్ చేయగా.. థ్రెట్స్ ఉన్నప్పుడు ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే కదా అని అంటున్నారు.