Prabhas New Look: ప్రభాస్ కొత్త లుక్ ఎలా ఉందో చూడండి

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) కు సంబంధించి చిన్న విషయం అయినా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే.

Last Updated : Sep 9, 2020, 02:27 PM IST
    • డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) కు సంబంధించి చిన్న విషయం అయినా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే.
    • బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాగా బిజీ గా ఉన్నాడు.
Prabhas New Look: ప్రభాస్ కొత్త లుక్ ఎలా ఉందో చూడండి

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) కు సంబంధించి చిన్న విషయం అయినా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే. బాహుబలి ( Baahubali )  చిత్రంతో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాగా బిజీ గా ఉన్నాడు. అటు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.. మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్.

ఇక ప్రభాస్ గురించి రెగ్యులర్ గా వార్తల్లో చదువుతున్న అభిమానులు కొద్ది సేపటి క్రితమే ప్రభాస్ ఫ్యాన్ ఎకౌంట్ లో విడుదలై  ప్రభాస్ కొత్త లుక్ ను ( Prabhas New Look ) చూసి వావ్ అంటున్నారు.  ఈ కొత్త లుక్ లో ప్రభాస్ చాలా కూల్ గా, సింప్లీ సూపర్ గా కనిపిస్తున్నాడు అని అభిమానులు సంతోషడుతున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది అని సమాచారం. దాంతో పాటు టీ సిరిస్ తో ఆదిపురుష్ ( Adipurush ) చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తరువాత నాగ్ అశ్విన్ తో సినిమాలు చేయడానికి ఆదిపురుష్ కన్నా ముందే అంగీకరించాడు. ఈ చిత్రాలన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలు. ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

Trending News