Vijay Antony Bichagadu 2 Review: విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడు నుంచి హీరోగా మారి తమిళ్ లో అనేక హిట్ సినిమాలు చేశాడు. బిచ్చగాడు అనే సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాడు ఇక ఆ బిచ్చగాడు సినిమాకి సెకండ్ పార్ట్ వస్తుందని తెలిసినప్పటి నుంచి తమిళ సహా తెలుగు ప్రేక్షకులు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ బిచ్చగాడు సినిమా శుక్రవారం నాడు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిచ్చగాడు 2 కథ: 
విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోనీ) ఇండియాలోనే ఏడవ రిచెస్ట్ పర్సన్. అనేక రంగాల్లో వ్యాపారాలు చేస్తూ బిజీబిజీగా గడిపే అతనికి అన్ని విషయాల్లో అతని స్నేహితుడు అరవింద్(దేవ్ గిల్) తోడుగా ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో అరవింద్ పగ తీర్చుకునేందుకుగాను విజయ్ బ్రెయిన్ తీసి సత్య అనే ఒక అనాధ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చేయిస్తాడు. విజయ్ తాను చెప్పినట్టు వినడు కాబట్టి సత్య(విజయ్ ఆంటోనీ) అనే ఒక అనాధను ఎంచుకొని అతన్ని తన పావుగా వాడుకోవాలని అనుకుంటాడు.


సత్య చిన్నప్పుడే చెల్లికి దూరమై ఆమెను వెతుకులాడుతూ బిచ్చగాడిగా జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్  గురుమూర్తి శరీరంలో సత్య మెదడు ఉంటుంది. ముందు తాను ఆ శరీరంలో ఉండడానికి ఇబ్బంది పడినా తర్వాత ఒక స్వామీజీ సలహాతో అదే శరీరంలో ఉండి తన చెల్లిని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు సత్య. మరి సత్య తన చెల్లెల్ని చేరుకోగలిగాడా? ఇంతకీ యాంటీ బికిలి అంటే ఏమిటి? తనను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న విజయ్ ప్రియురాలు హేమ సహాయంతో విజయ్ శరీరంలో ఉన్న సత్య బ్రెయిన్ ఏం చేసింది అనేది ఈ సినిమా.


విశ్లేషణ:
బిచ్చగాడు మొదటి భాగం చూసిన వారందరూ చాలా ఎక్సైట్ అవుతారు, మదర్ సెంటిమెంట్ సినిమా కావడంతో ఎక్కువగా సినిమాకి కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఈ సినిమా కూడా బానే ఉంటుందని అందరూ భావించారు.  కానీ మొదటి భాగానికి ఈ భాగానికి కథతో కానీ పాత్రలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం బిచ్చగాడు అనే ఒక టైటిల్ని మాత్రమే రిజిస్టర్ చేసి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు.


ఇక బిచ్చగాడు సెకండ్ పార్ట్ విషయానికి వస్తే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. గతంలోనే ఈ కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాలో కూడా అదే కాన్సెప్ట్ వాడుకున్నారు. ఒక డబ్బున్న వాడిని వశం చేసుకోవడానికి అతని మెదడు తీసేసి ఒక బిచ్చగాడు మెదడు పెట్టి తాము చెప్పినట్టు ఆడించాలని దుర్మార్గుల ముఠా ప్రయత్నిస్తుంటే ఆ మెదడు ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తయిన తర్వాత ఆ బిచ్చగాడు వారికి ఎలా షాక్ ఇచ్చాడు? ఊహించని పరిణామానికి ఆ గ్యాంగ్ ఏమైంది? లాంటి విషయాలు ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ రెండు పాత్రలలో కనిపించాడు.


ఈ రెండు పాత్రలతో బోర్ కొట్టిస్తూనే సాగుతున్న సినిమా ఒక్కసారిగా ప్రీ ఇంటర్ బ్లాక్ తో ప్రేక్షకులను అలర్ట్ అయ్యేలా చేస్తుంది. ముందు బ్రైన్స్ మార్పిడితో మొదలైన ఈ వ్యవహారం తర్వాత పొలిటికల్ టచ్ తోటి మరింత ఆసక్తికరంగా మారుతుంది. కానీ సినిమా మొత్తానికి నిడివి సమస్యగా మారిపోయింది. చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా చెప్పకుండా ఎక్కువ డ్రామా క్రియేట్ చేయడం ప్రేక్షకులను కాస్త అసహనానికి గురి అయ్యేలా చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తాన్ని ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కొన్ని కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది. మెసేజ్ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే విధంగా సాగుతుంది.


Also Read: Samantha Mistake: తెలిసీ తప్పు చేస్తున్న సమంత.. ఇలా అయితే కష్టమే?


నటీనటుల విషయానికి వస్తే
విజయ్ ఆంటోనీ ఎప్పటిలాగే తనదైన శైలిలోనే నటించాడు. నిజానికి ఆయన మంచి నటుడై ఉండవచ్చు కానీ ఎక్స్ప్రెషన్స్ విషయంలో చాలా పూర్. ఆయన గత సినిమాలు అదే ప్రూవ్ చేస్తే ఈ సినిమా కూడా అదే ప్రూవ్ చేసింది. అన్నిచోట్ల సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఆయన కథ నడిపించే ప్రయత్నం చేశాడు. దానికి తోడు సినిమాలో రెండు పాత్రలు పోషించడం మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కావ్య థాపర్ హీరోయిన్ గా ఒకటి రెండు సాంగ్స్ లో మాత్రమే కనిపించే ప్రయత్నం చేసింది. ఆమెకు చాలా తక్కువ స్క్రీన్ ప్లేస్ లభించింది. దేవ్ గిల్, జాన్ విజయ్, హరీష్ పేరడీ, యోగి బాబు వంటి వారు కనిపించారు కానీ ఎవరివి పెద్దగా గుర్తుంచుకో తగ్గ పాత్రలు కావు. ఇక మిగతా వారు తమ తమ పాత్రలో పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.


టెక్నికల్ టీమ్:
విజయ్ ఆంటోనికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా అయినా చాలావరకు కథను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ నిడివి విషయంలో కాస్త కేరింగ్ గా ఉండి ఉంటే బాగుండేది. అలాగే లాజిక్స్ కూడా కన్వే అయ్యేవిధంగా కథనం కూడా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ కూడా ఆయనే చేశారు కాబట్టి ఎడిటింగ్ టేబుల్ మీద కూడా మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక సంగీతం కూడా ఆయన అందించారు కానీ మొదటి భాగంలో 100 దేవుళ్ళే దిగివచ్చినా లాంటి సాంగ్స్ ఉండడంతో ఆ సినిమా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది.


కానీ ఈ రెండవ సినిమాలో అలాంటి రిజిస్టర్ అయ్యే సాంగ్ ఒకటి కూడా లేదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లడంలో సహాయపడిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చాలావరకు సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలిగించేలా చేసింది. అలాగే కొన్ని గ్రాఫిక్స్ షాట్స్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. అవి గ్రాఫిక్స్ అనే విషయం ఇట్టే అర్ధం అయిపోతూ ఉంటుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. 


ఫైనల్ గా ఒక్కమాటలో 
లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 ఫ్యామిలీలతో కలిసి ఎంజాయ్ చేయదగిన సినిమా.


Rating:2.25/5


Also Read: Mahesh Babu wig: 'మహేష్ బాబు'ది విగ్గా.. కొత్త ఫొటోతో మళ్లీ చర్చలు మొదలు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి