Mahesh Babu Wig Secret: సెలబ్రిటీల సీక్రెట్స్ తెలుసుకోవాలని వారి అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రజల్లో కూడా చాలా ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారు బయటకు కనిపించే విధానం అంటే వారు ధరించే బట్టలు కానీ, చెప్పులు మొదలు షూస్ లేదా ఇతర యాక్సెసరీస్ ఎక్కడ కొంటున్నారు? ఎంత రేట్ పెట్టి కొంటున్నారు? వాటిని మేము ఎక్కడ సొంతం చేసుకోవచ్చు? లాంటి విషయాల మీద కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ హెయిర్ స్టైల్ ని తాము కూడా మెయింటైన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే చాలామంది అభిమానులు తమ తమ హీరోలు హెయిర్ స్టైల్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ దాని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక హీరోలు దాదాపుగా విగ్గులు లేదా ఎయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మెథడ్ ద్వారా తమకు జుట్టు ఉన్నట్టుగా అభిమానులను భ్రమింప చేస్తూ ఉంటారు.
Also Read: Anni Manchi Sakunamule Review: అన్నీ మంచి శకునములే' రివ్యూ..ఎలా ఉందంటే?
ఇక మహేష్ బాబు విగ్గు వ్యవహారం అయితే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. మహేష్ వయసు ఎక్కువే అయినా ఇప్పటికీ కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు. దీంతో ఆయన జుట్టు ఒరిజినల్ కాదని విగ్గని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ మధ్య కృష్ణ మరణించిన సమయంలో కృష్ణ మేకప్ మాన్ మహేష్ విగ్గు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఒకప్పుడు మహేష్ విగ్ వాడిన సంగతి తనకు తెలుసు కానీ తరువాత ఆయన అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయినా సరే మహేష్ బాబుని అభిమానించని వాళ్లు కొంతమంది మహేష్ బాబు విగ్గుతో బండి నడిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు తన లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేశాడు. అందులో సరికొత్త హెయిర్ స్టైల్ తో మహేష్ కనిపిస్తున్నాడు. దీంతో ఆయన అభిమానులందరూ ఆయనది విగ్గు అని కామెంట్ చేసే వాళ్ళు ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఎందుకంటే విగ్గు అయితే జుట్టు పెరిగినట్లు కనిపించదు కదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
Also Read: Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా చీరలో హాట్ ట్రీట్.. చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి