Vijay Antony Bichagadu 2 సమంత శాకుంతలం సినిమాకు ప్రతీ సారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా విడుదలకు ఇంకా నోచుకోవడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. కరోనా కంటే ముందు ప్రారంభమైన ఈ సినిమా ఇంత వరకు విడుదల కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. అప్పటికైనా ఈ సినిమా వస్తుందా? లేదా? అంటే క్లారిటీగా చెప్పలేం. కానీ ఇప్పుడు సమంత శాకుంతలంతో పోటీ పడేందుకు బిచ్చగాడు రాబోతోన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా వంద రోజులు ఆడి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బిచ్చగాడు చిన్న సినిమాగా వచ్చి తల్లి సెంటిమెంట్‌తో కోట్లు కొల్లగొట్టేసింది. విజయ్ ఆంటోని ఇప్పుడు బిచ్చగాడు పార్ట్ 2ని విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు. ఏప్రిల్ 14న ఈ చిత్రం రాబోతోన్నట్టుగా విడుదల చేశారు.


దీంతో సమంత, విజయ్‌ ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తారా? లేదంటే సమంత మళ్లీ వెనక్కి తగ్గుతుందా? అన్నది చూడాలి. అయితే బిచ్చగాడు సినిమాకు వచ్చిన క్రేజ్ ఈ పార్ట్‌ 2కి కూడా ఉంటుందా? కలెక్షన్లను రాబడుతుందా? అసలు ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అన్నది చూడాలి.


పార్ట్ 2లో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లెంటేషన్ గురించి కథ సాగేట్టుగా కనిపిస్తోంది. ఇది వరకు విడుదల చేసిన స్నీక్ పీక్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే శాకుంతలం సినిమా ట్రైలర్ విషయంలో మాత్రం జనాలు పెదవి విరిచారు. పూర్ సీజీ, వీఎఫ్‌ఎక్స్ అంటూ ట్రోల్ చేశారు.


అయితే ఏప్రిల్ 14న ఈ రెండు సినిమాలే కాకుండా మరేతర చిత్రమైనా బరిలోకి దిగితే అప్పుడు పోటీ ఎలా ఉంటుందో చూడాలి. విజయ్, సమంతల మధ్య అయితే పోటీ రసవత్తరంగానే ఉండేలా కనిపిస్తోంది. కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఇద్దరికీ మంచి క్రేజ్ అయితే ఉంది. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook