Vijay Antony Recoverd: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత హీరోగా మారి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గత కొద్ది రోజులుగా ఆయన ఫ్యాన్స్ అందరూ ఆందోళన పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు, మలేషియాలో ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన ఒక బోట్ చేజింగ్ సీక్వెన్స్ లో పాల్గొంటున్న సమయంలో బోట్ అదుపుతప్పి కెమెరా టీం ఉన్న మరో బోట్ ని ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే సినిమా యూనిట్ ఆయనని హాస్పిటల్ కి తరలించినా సరే ఆయన కోమాలో ఉన్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషయమంగా ఉందని ప్రచారం జరిగింది. అంతేకాక ఆమె భార్య మలేషియా వెళ్లడమే కాదు అక్కడి నుంచి ఆయనను తీసుకువచ్చి చెన్నైలో సర్జరీ చేయించే అవకాశం ఉందని కూడా అన్నారు. అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి బిచ్చగాడు 2 హీరో విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని వీలైనంత త్వరలో అందరితో మాట్లాడతానని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.


తన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పిన విజయ్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ లో ఆయన అంతా బాగానే ఉంది అంటూ థమ్సప్ చూపిస్తున్న ఫోటో షేర్ చేశారు. దవడ, ముక్కు భాగాలలో తీవ్ర గాయాల నుంచి బయటపడ్డానని పేర్కొన్న ఆయన దానికి సంబంధించిన సర్జరీ కూడా పూర్తయిందని త్వరలోనే మీ అందరితో మాట్లాడతానని చెప్పుకొచ్చారు..


విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న బిచ్చగాడు 2 సినిమాలో ఏక్ మినీ కధ హీరోయిన్ కావ్య థాపర్ నటిస్తోంది. ఇక గతంలో వచ్చిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక డాక్టర్ సలీం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ తర్వాత వచ్చిన బిచ్చగాడు, బేతాళుడు వంటి సినిమాలతో మరింత దగ్గరయ్యారు. ఇక ఆయన కోలుకున్నారు అనే విషయం తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Rajamouli on Naatu Naatu: చరణ్, ఎన్టీఆర్ టార్చర్ పెట్టినందుకు సారీ.. రాజమౌళి ఎమోషనల్ నోట్ వైరల్!


Also Read: RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook