Vijay devarakonda falls from stairs video viral: రౌడీ స్టార్ విజయ దేవర కొండ ఇటీవల వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే.. విజయ్.. వీడీ 12 షూటింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా గాయపడినట్లు తెలుస్తొంది. వెంటనే ఆయనను టీమ్.. ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తొంది. విజయ్ దేవర కొండక స్కానింగ్ లు చేసిన వైద్యులు.. కొన్నిరోజుల పాటు రెస్ట్ తీసుకొవాలని చెప్పారంట. కానీ ఆయన మాత్రం మళ్లీ షూటింగ్ లకు వెళ్తున్నారని తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే.. విజయ్ దేవర కొండ హెల్త్ పట్ల అభిమానులు, ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మీక మందన్న తీవ్ర ఆందోళనగా ఉందంట. అయితే.. ఇది చాలదన్నట్లు విజయ్ మళ్లీ కాలు జారీ పడినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


విజయ్ దేవర కొండ ప్రస్తుతం.. రాధిక మదన్ తో కలిసి.. సాహిబా అనే మ్యూజికల్ ఆల్బమ్ ను చేస్తున్నారు. అభిమానుల ముందుకు తొందరలోనే వస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రౌడీ స్టార్ ముంబైకు వెళ్లినట్లు తెలుస్తొంది. ఒక  కార్యక్రమంలో పాల్గొని మెట్ల పై నుంచి బైటకు వెళ్తున్నారు. ఇంతలో ఆయన ఒక్కసారిగా కాలు జారీ కింద పడిపోయారు. దీంతో అభిమానులు అయ్యయ్యో.. అంటూ షాక్ కు గురయ్యారు.


వెంటనే అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది విజయ్ కు సపర్యలు చేసిన అక్కడి నుంచి  పంపించి వేసినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్కసారిగా అక్కడ అభిమానులు విజయ్ ఆరోగ్యం గురించి మళ్లీ ఆందోళన చెందుతున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారింది. కాగా, ఇటీవల విజయ్ దేవర కొండ  ఇంట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే.


Read more: Sobhita-Nagachitanya: శోభితాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. సమంతా పోస్ట్ వైరల్.. షాక్‌లో అక్కినేని అభిమానులు..


అయితే.. ఇటీవల మాత్రం విజయ్ దేవర కొండ ఒక వైపు తీసిన సినిమాలు అంతగా హిట్ ను సాధించలేకపోయాయని తెలుస్తొంది. మరొవైపు వరుస ప్రమాదాలతో విజయ్ మాత్రం కాస్తంత ఒత్తిడికి గురౌతున్నరని వార్తలు వస్తున్నాయి. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.